IND vs NZ: డారిల్ మిచెల్ హాఫ్ సెంచరీ.. 43 ఓవర్లకు న్యూజిలాండ్ 184/5
న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.
కుల్‌దీప్ వేసిన 43 ఓవర్‌లో నాలుగో బంతికి బ్రాస్‌వెల్ ఫోర్ బాదాడు. 65 బంతుల తర్వాత వచ్చిన తొలి బౌండరీ ఇది.
43 ఓవర్లకు స్కోరు 184/5. మిచెల్ (50), బ్రాస్‌వెల్ (11) పరుగులతో ఉన్నారు.
ఫిలిప్స్ బౌల్డ్
37.5 ఓవర్లో గ్లెన్ ఫిలిప్స్‌ను వరున్ చక్రవర్తి బౌల్డ్ చేశాడు. ఫిలిప్స్ 52 బంతుల్లో 34 పరుగులు చేశాడు. మిఛెల్ బ్రేస్‌వెల్ క్రీజ్‌లోకి వచ్చాడు.
మిఛెల్‌కు మరో లైఫ్
కివీస్ బ్యాటర్ మిఛెల్‌కు మరోలైఫ్ దక్కింది. 36వ ఓవర్ లాస్ట్ బాల్‌కు మిఛెల్ నుంచి మరో క్యాచ్ రాగా శుభ్‌మన్ గిల్ మిస్ చేశాడు.
35 ఓవర్లకు కివీస్ 153/4 పరుగులు చేసింది. మిఛెల్ 40 పరుగులతో అర్థసెంచరీకి చేరువలో ఉన్నాడు. కాగా 34.5 ఓవర్ల దగ్గర మిఛెల్ క్యాచ్‌ను రోహిత్ మిస్ చేయడంతో అతడికి మరో లైఫ్ దక్కింది.
IND vs NZ: 33 ఓవర్లు.. 150కి చేరువలో న్యూజిలాండ్ స్కోరు
న్యూజిలాండ్ బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు.
గత నాలుగు ఓవర్లలో 16 పరుగులు రాబట్టారు.
జడేజా వేసిన 32 ఓవర్‌లో ఫిలిప్స్ ఫోర్ బాదాడు.
33 ఓవర్లకు స్కోరు 147/4. గ్లెన్ ఫిలిప్స్ (24), డారిల్ మిచెల్ (36) పరుగులతో ఉన్నారు.
27 ఓవర్లకు స్కోరు 123/4. గ్లెన్ ఫిలిప్స్ (15 బంతులకు 10), డారిల్ మిచెల్ (51 బంతులకు 27) పరుగులతో ఉన్నారు.
లాతమ్ ఔట్
23వ ఓవర్ బౌలింగ్ చేసిన జడేజా రెండో బంతికే లాథమ్‌ను ఔట్ చేశాడు. ఎల్‌బీడబ్ల్యూ అప్పీల్ చేయడంతో కివీస్ జట్టు డీఆర్ఎస్ తీసుకుంది. కాగా థర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చారు. లాథమ్ వికెట్ కోల్పోవడం కివీస్‌కు భారీ ఎదురుదెబ్బ కానుంది. లాథమ్ వికెట్ పడటంతో గ్లెన్ ఫిలిప్పీస్ బరిలోకి దిగాడు. ఇప్పటి వరకు కివీస్ 108/4 పరుగులు చేశారు.
ఒక డీఆర్ఎస్ పోయా..
ఒక రివ్యూ కోల్పోయిన భారత్. జడేజా బౌలింగ్‌లో లాథమ్ ఎల్‌బీడబ్ల్యూకు భారత్ అప్పీల్ చేసింది. అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో డీఆర్ఎస్ తీసుకుంది. అయినా బాల్ వికెట్ల పైనుంచి వెళ్లిపోతుండటంతో లాథమ్‌ను థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించారు. దీంతో భారత్ ఒక డీఆర్ఎస్‌ను కోల్పోగా ఇంకా ఒక్కటి మిగిలి ఉంది. కివీస్‌కు రెండు డీఆర్ఎస్ అవకాశాలు అలానే ఉన్నాయి.
కవీస్‌ను కట్టడి చేస్తున్న భారత బౌలర్లు. 21 ఓవర్లకు కవీస్ కేవలం 102/3 పరుగులు చేసింది. 20 వ ఓవర్ బౌలింగ్ చేసిన వరుణ్.. ఒక్క పరుగుతో కివీస్‌ను కట్టడి చేశాడు. అనంతరం 21వ ఓవర్ బౌలింగ్ చేయడానికి జడేజా వచ్చాడు.
న్యూజిల్యాండ్ 19 ఓవర్లకు 99/3
రవీంద్ర జడేజా బౌలింగ్‌కు వచ్చాడు. ఓవర్లలో కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు.
దీంతో 20 ఓవర్లకు కివీస్ 101/3 పరుగులు చసింది.