ఛాంపియన్ ట్రోఫీ-2025 ఫైనల్స్
ఛాంపియన్ ట్రోఫీ-2025 సిరీస్ అంతా కూడా బ్రెత్ టేకింగ్‌గా సాగింది. భారీభారీ స్కోర్లు, వాటిని ఛేదించడానికి ప్రత్యర్థి జట్లు పర్వఫుల్ పర్ఫార్మెన్స్‌తో సిరీస్ అంతూ ఇంట్రస్టింగ్‌గా సాగింది.;
ఛాంపియన్ ట్రోఫీ-2025 సిరీస్ అంతా కూడా బ్రెత్ టేకింగ్‌గా సాగింది. భారీభారీ స్కోర్లు, వాటిని ఛేదించడానికి ప్రత్యర్థి జట్లు పర్వఫుల్ పర్ఫార్మెన్స్‌తో సిరీస్ అంతూ ఇంట్రస్టింగ్‌గా సాగింది. ఇందులో టీమిండియా మొదటి నుంచి ప్రత్యర్థులపై విరుచుకుపడింది. టీమిండియా ప్లేయర్స్ అంతా ప్రత్యర్థులకు సింహస్వప్నంలా మారారు. ప్రత్యర్థులు అందించిన లక్ష్యాన్ని ఛేదించడమే కాకుండా.. ప్రత్యర్థి బ్యాటర్లను పెవిలియన్ చేర్చడంలో కూడా టీమిండియా ప్లేయర్స్ అద్భుతంగారాణించారు. ఇప్పుడు ఈ సిరీస్ ఫైనల్స్‌కు వచ్చేసింది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను కప్‌ను భారత్ కౌవసం చేసుకుంది. ఆరు వికెట్లుకోల్పోయి 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాచ్‌ను 4తో ఫినీష్ చేశాడు జడేజా.
హార్దిక్ పాండ్యా ఔట్. జెమిసన్ వేసిన బంతిని గాలిలోకి లేపడంతో జెమిసనే క్యాచ్ పట్టాడు. హార్దిక్ 18 బంతుల్లో 18 పరుగులు చేశాడు. భారత్ 15 బంతుల్లో 11 పరుగులు చేయాలి.
టీమిండియా 45 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది.
అక్సర్ పటేల్ క్యాచ్ ఔట్ అయ్యాడు. అక్సర్ 40 బంతుల్లో 20 పరుగులు చేశాడు. బ్రాస్‌వెల్ బౌలింగ్‌లో అక్సర్ బంతిని గాల్లోకి లేపాడు. ఒరౌర్కే క్యాచ్ పట్టాడు.
శ్రేయస్ అయ్యర్ క్యాచ్ ఔట్ అయ్యాడు. శాంట్‌నర్ బౌలింగ్‌లో రవింద్ర క్యాచ్ పట్టాడు. అయ్యర్ 62 బంతుల్లో 48 పరుగులు చేశాడు.
మ్యాచ్ దూకుడుగా ప్రారంభించిన భారత్ 35 ఓవర్లకు చేరేసరికి నిలకడగా ఆడటంపై దృష్టిపెట్టింది. ఓపెనర్ గిల్, కోహ్లీ, రోహిత్ ఔట్ కావడంతో అక్సర్, శ్రేయాస్ డిఫెన్స్‌లో పడ్డారు. వికెట్లను కాపాడుకుంటూ మ్యాచ్‌నుముందుకు తీసుకెళ్తున్నారు. టీమిండియా గెలవాలంటే.. ఛాంపియన్స్ ట్రోఫీను కైవసం చేసుకోవాలంటే.. 90 బంతుల్లో 91 పరుగులు చేయాలి.
టీమిండియా 34 ఓవర్లకు 159/3 పరుగులు చేసింది. అక్సర్ పటేల్ 24 బంతులకు 12 పరుగులు చేశాడు. శ్రేయాస్ అయ్యర్ 45 బంతులకు 34 పరుగులు చేశాడు.
టీమ్ఇండియాకు మరో షాక్ తగిలింది. రోహిత్ శర్మ (76) ఔటయ్యాడు.
రచిన్ రవీంద్ర వేసిన 26.1 ఓవర్‌కు భారీ షాట్ ఆడే ప్రయత్నంలో స్టంపౌటయ్యాడు.
భారత్ 20 ఓవర్లకు గానూ 2 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది.
విరాట్ కోహ్లీ వచ్చినట్లే వచ్చి పెవిలియన్ చేరుకున్నాడు. బ్రాస్‌వెల్ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. వెంటనే భారత్ రివ్యూ రిక్వెస్ట్ చేసింది. కాగా ఫస్ట్ అంపైర్ ఇచ్చిన డెసిషన్‌ను క్యాన్సిల్ చేస్తూ నాటౌట్‌గా ప్రకటించాడు థర్డ్ అంపైర్. దీంతో భారత్ ఒక రివ్యూను కోల్పోయింది.