ఛాంపియన్ ట్రోఫీ-2025 ఫైనల్స్

Update: 2025-03-09 10:13 GMT
Live Updates - Page 2
2025-03-09 14:16 GMT

శుభ్‌మన్ గిల్ ఔట్

శుభ్‌మన్ గిల్ క్యాచ్ ఔట్అయ్యాడు. శాంటనర్ బౌలింగ్‌లో గిల్ క్యాచ్‌ను ఫిలిప్స్ పట్టాడు. గిల్ 50 బంతుల్లో 31 పరుగులు చేశాడు.

2025-03-09 13:47 GMT

రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ

రోహిత్ శర్మ వీరవిహారం చేస్తున్నాడు. ప్రారంభం నుంచి స్కోర్‌ను పరుగులు పట్టించాడు. రోహిత్ 41 బంతుల్లో 50 పరుగులు చేశాడు. వరుస బౌండ్రీలతో కవీస్ బౌలర్లను బెంబేలెత్తిస్తున్నాడు.

2025-03-09 13:36 GMT

మొదటి రెండు ఓవర్లలో 22 పరుగులు రాబట్టిన భారత్.. తర్వాతి మూడు ఓవర్లలో 9 పరుగులే చేసింది. 5 ఓవర్లకు స్కోరు 31/0. రోహిత్‌ శర్మ (21), శుభ్‌మన్ గిల్ (5) క్రీజులో ఉన్నారు

2025-03-09 13:02 GMT

సిక్స్‌తో మొదలైన స్కోరింగ్. తొలి బంతి డాట్ బాల్ అయినా రెండో బంతికే సిక్స్ బాదాడు రోహిత్.. దీంతో భారత్ బ్యాంటింగ్ శుభారంభం అందుకుంది.

2025-03-09 13:00 GMT

బ్యాంటింగ్ వచ్చిన భారత్

252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్. శుభ్‌మన్ గిల్, రోమిత్ శర్మ ఓపెనింగ్‌కు వచ్చారు. రోహిత్ స్ట్రైకర్ కాగా గిల్ నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్నాడు. 

2025-03-09 12:29 GMT

నిర్ణీత 50 ఓవర్లకు న్యూజిల్యాండ్ 7 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. బ్రేస్‌వెల్ 40 బంతుల్లో 53 పరుగులు చేశాడు.

2025-03-09 12:26 GMT

శాంట్నర్ ఔట్

షమి బౌలింగ్లో శాంట్నర్ రనౌట్ అయ్యాడు. కోహ్లీ త్రో వేయగా కేఎల్ రాహుల్ స్టంప్స్ కొట్టాడు. శాంట్నర్ 8 బంతుల్లో 10 పరుగులు చేశాడు. ఇప్పుడు నాథన్ స్మిత్ క్రీజ్‌లోకి వచ్చాడు. 49 ఓవర్లకు కివీస్ 239/7 పరుగులు చేశారు.

2025-03-09 12:09 GMT

46 ఓవర్లకు న్యూజిలాండ్ 211/6 పరుగులు చేసింది. క్రీజ్‌లో బ్రేస్‌వెల్, శాంట్నర్ ఉన్నారు. 

2025-03-09 12:06 GMT

మిఛెల్ ఔట్

గ్లెన్ మిఛెల్ వికెట్‌ను షమి తన ఖాతాలో వేసుకున్నాడు. షమి బౌలింగ్‌లో మిఛెల్ బంతిని గాల్లోకి లేపాడు రోహిత్ షర్మ క్యాచ్ పట్టాడు. మిఛెల్ 101 బంతుల్లో 63 పరుగులు చేశాడు.

2025-03-09 12:02 GMT

45 ఓవర్లకు న్యూజిల్యాండ్ 201/5 పరుగులు చేసింది. బ్రేస్‌వెల్ 25 బంతుల్లో 24 పరుగులు, మిఛెల్ 97 బంతుల్లో 53 పరుగులు చేశాడు.

Tags:    

Similar News