నిలకడగా శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యం

ఐసీయూ నుంచి సాధారణ గదికి తరలింపు

Update: 2025-10-28 08:02 GMT
శ్రేయస్ అయ్యార్

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో సందర్భంగా క్యాచ్ అందుకుంటూ గాయపడిన భారత వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను ఐసీయూ నుంచి తరలించారు. ప్రస్తుతం మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు తెలిసింది. ప్లీహం, పక్కటెముకల్లో గాయంతో అంతర్గత రక్తస్రావం జరిగినట్లు వైద్యులు ప్రకటించారు.

‘‘అతడిని(శ్రేయస్) ను ఐసీయూ నుంచి తరలించారు. సిడ్నీలోని ఆసుపత్రి నుంచి డిశ్చార్చ్ కావడానికి ఇంకొన్ని రోజులు పట్టవచ్చు’’ అని బీసీసీఐని కోట్ చేస్తూ ఓ వార్తా సంస్థ నివేదించింది.
కీలక పారామితులు..
హర్షిత్ రాణా బౌలింగ్ లో అలెక్స్ క్యారీ ఇచ్చి క్యాచ్ ను పట్టుకునే ప్రయత్నంలో అయ్యర్ పక్కటెముకలపై బలంగా నేలను తాకాడు. మైదానంలో కుప్పకూలిన అయ్యర్ కు మొదట ఫిజియో సహాయంతో చికిత్స తీసుకుని మైదానం వీడాడు.
తరువాత డ్రెస్సింగ్ రూమ్ లో కిందపడటంతో అయ్యర్ కు పరీక్షలు చేయగా కీలకమైన పారామితులు తగ్గినట్లు తేలింది. ఆస్పత్రిలో పరీక్షలలో ప్లీహాములో గాయం కారణంగా అంతర్గత రక్తస్రావం జరిగిందని తేలింది. ఈ తరువాత అతడిని ఐసీయూలో చేర్చారు.
సిడ్నీకి అయ్యర్ కుటుంబం..
బీసీసీఐ వైద్య సేవల అధిపతి డాక్టర్ దిన్షా పార్డివాలా బోర్డుకు పంపిన లేఖ ప్రకారం.. మైదానంలో ఉన్న వైద్య సిబ్బంది వేగంగా, సమర్థవంతంగా ప్రతిస్పందించారని పేర్కొన్నారు.
ఇది క్లిష్టపరిస్థితిని నివారించిందని పేర్కొన్నారు. అయ్యార్ కోలుకుంటున్నందున ఆయనకు తోడుగా ఉండటానికి కుటుంబ సభ్యులు త్వరలో సిడ్నీకి వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Tags:    

Similar News