జమ్మూకశ్మీర్ పహల్గామ్లో ఏప్రిల్ 22న భారత పర్యాటకులను అత్యంత అమానవీయంగా హతమార్చిన ఉగ్రవాదుల ఫొటోలను జమ్మూకశ్మీర్ పోలీసులు విడుదల చేశారు. వారిపై రూ.20 లక్షల రివార్డ్‌ను కూడా ప్రకటించారు. ఉగ్రవాదులను పట్టుకోవడం కోసం రాష్ట్రమంతా జల్లెడపడుతున్నారు. ఇదిలా ఉంటే భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ పాక్ కవ్వింపు చర్యలను మానుకోవడం లేదు. సోమవారం రాత్రి సమయంలో కూడా డ్రోన్లతో పలు ప్రాంతాలను టార్గెట్ చేస్తూ దాడులు చేసింది. వాటిని భారత్ తిప్పికొట్టింది. ఈ క్రమంలో ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి ఎయిర్‌లైన్ సంస్థలు పలు విమానాలను రద్దు చేశాయి. శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, ఛండీగఢ్ సహా మరిన్ని సరిహద్దు నగరాలకు వెళ్లే విమానాలను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. ప్రయాణికుల రక్షణను, ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని వెల్లడించాయి. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత మోదీ చేసిన తొలి ప్రసంగం ఇదే కావడం విశేషం. ఈ ప్రసంగంలో ఆయన పాక్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అణుబాంబుల బెదిరింపులకు భారత్ భయపడదని స్పష్టం చేశారు. ‘‘ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకొచ్చిన కొత్త పాలసీనే ‘ఆపరేషన్ సిందూర్’. పాకిస్థాన్‌పై మేము మా కార్యకలాపాలను మాత్రమే ఆపేశాం. భవిష్యత్తు అనేది వారి తీసుకున్నే నిర్ణయాలు, వారి ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది’’ అని మోదీ పేర్కొన్నారు. అంతేకాకుండా పాకిస్థాన్ పాలకులకు కూడా కొన్ని సూచనలు చేశారు. ‘‘ఇన్నాళ్లూ ఆ దేశం పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులే ఆ పాకిస్థాన్‌ను దెబ్బతీస్తారు. దానిని నుంచి పాకిస్థాన్ బతికి బట్టకట్టాలంటే ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాన్ని, ఉగ్రవాదులను భారత్ వేరుగా చూడదు’’ అని ఉగ్రవాదంపై భారత వైఖరిని మోదీ పునరుద్ఘాటించారు. ఇదే క్రమంలో ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుందని భారత త్రివిధ దళాధిపతులు వెల్లడించారు.