నేడే తెలంగాణ ఫలితాలు... లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి
తెలంగాణలో మూడు ప్రధాన పార్టీల మధ్య లోక్‌సభ ఎన్నికల సమరం హోరాహోరీగా సాగింది. ఎన్నికల ఫలితాల్లో మూడు పార్టీలూ తమదే పైచేయి ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
తెలంగాణలో మూడు ప్రధాన పార్టీల మధ్య లోక్ సభ ఎన్నికల సమరం హోరాహోరీగా సాగింది. పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తమదంటే తమదే పైచేయి ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకున్న కాంగ్రెస్.. లోక్ సభలో 13 స్థానాలు కైవసం చేసుకుంటామంటుంటే, అబ్ కీ బార్ చార్ సౌ పార్ అంటున్న బీజేపీ రాష్ట్రంలో డబుల్ డిజిట్ సాధిస్తామంటోంది. ఇక హ్యాట్రిక్ కొడతామని బోర్లాపడ్డ బీఆర్ఎస్.. లోక్ సభ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకుని పరువు నిలబెట్టుకోవాలని ఆశగా ఉంది. పార్టీలే కాదు, అత్యంత హైప్ తో సాగిన పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. నేటి (మంగళవారం) తో ఆ ఉత్కంఠకు తెర పడనుంది. మరి కొన్ని గంటల్లో తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాల ఫలితాలు వెలువడనున్నాయి. పార్లమెంటు అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్న ఫలితాల అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే ది ఫెడరల్ వెబ్సైట్ లైవ్ ఫాలో అవండి.
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 34 చోట్ల ఓట్ల లెక్కింపు జరగనుంది. 4వ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు మే 13వ తేదీన పోలింగ్ జరిగింది. మొత్తం 119 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో లెక్కింపునకు 1,855 టేబుళ్లు ఏర్పాటు చేశారు. అత్యధికంగా మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 24 రౌండ్లలో, అత్యల్పంగా మూడుచోట్ల 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుపుతున్నారు.
ఇక ఈరోజే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నిక ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఈ నియోజకవర్గానికి కాంగ్రెస్ నుంచి గణేష్ నారాయణన్, బీజేపీ నుంచి వంశి తిలక్, బీఆర్ఎస్ నుంచి నివేదిత బరిలో ఉన్నారు.
కాంగ్రెస్ - 8 స్థానాల్లో విజయం
చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి - 2,22,249
రామసహాయం రఘురాంరెడ్డి, ఖమ్మం - 4-67,847
పోరిక బలరాం నాయక్, మహబూబాబాద్ - 3,44,214
మల్లు రవి, నాగర్ కర్నూల్ - 94,361
రఘువీర్ రెడ్డి, నల్గొండ - 5,59,905
గడ్డం వంశీకృష్ణ, పెద్దపల్లి - 1,31,364
కడియం కావ్య, వరంగల్ - 2,19,691
సురేష్ షెట్కార్, జహీరాబాద్ - 47,896
బీజేపీ 8 స్థానాల్లో విజయం
గోడం నగేష్, ఆదిలాబాద్ - 84,397
కొండా వివిశ్వేశ్వర్ రెడ్డి, చేవెళ్ల - 1,64,129
బండి సంజయ్, కరీంనగర్ - 3,38,797
డీకే అరుణ, మహబూబ్ నగర్ - 3,636
ఈటల రాజేందర్, మల్కాజిగిరి - 3,87,375
రఘునందన్ రావు, మెదక్ - 34,898
ధర్మపురి అర్వింద్, నిజామాబాద్ - 1,09,241
కిషన్ రెడ్డి, సికింద్రాబాద్ - 49,944
ఒక స్థానంలో AIMIM విజయం
అసదుద్దీన్ ఓవైసీ, హైదరాబాద్ - 3,38,797
ఉత్కంఠ రేపుతున్న మహబూబ్‌నగర్ ఎంపీ ఫలితం. అన్ని రౌండ్లు ముగిసేసరికి 1800 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ. పోస్టల్ బ్యాలెట్‌తో తేలనున్న మహబూబ్‌నగర్ ఫలితం.
13 వేలకు పైగా మెజార్టీతో బీజేపీ అభ్యర్థి తిలక్‌పై కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ గెలుపు.. దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత చెల్లెలికికి దక్కని సానుభూతి.. మూడో స్థానానికి పడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత..
ఖమ్మం, నల్గొండలో కాంగ్రెస్ విజయం సాధించింది.
ఏపీలో టీడీపీ విజయంతో ఖమ్మం టీడీపీ కార్యాలయంలో వేడుకలు జరుపుకున్న కార్యకర్తలు. సంబురాల్లో పాల్గొన్న కాంగ్రెస్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తెలంగాణలో తొలి విజయం నమోదైంది. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి 3.5 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై ఆయన విజయం సాధించారు.
నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి 3,77,941 ఓట్ల ఆధిక్యంతో ముందున్నారు. ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామ్ రెడ్డి తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావుపై 3,24,651 ఓట్ల ఆధిక్యతతో ముందుకు సాగుతున్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ 2,24,429 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 1,20,630 ఓట్ల ఆధిక్యంతో ముందుకు సాగుతున్నారు. పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 69,050 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. జహీరాబాద్ లో సురేశ్ షెట్కార్ 16,228 ఓట్ల ముందంజలో ఉన్నారు.
పెద్దపల్లి: 34786
జహీరాబాద్ : 10790
నాగర్ కర్నూల్ : 23035
నల్గొండ: 223038
భువనగిరి: 69545
వరంగల్: 62532
మహబూబా బాద్:120726
ఖమ్మం: 204984
9th రౌండ్ ముగిసేసరికి మహబూబ్ నగర్ లో
బీజేపీ - డీకే అరుణకు పోలైన ఓట్లు 156868
కాంగ్రెస్ - చల్లా వంశీచంద్ రెడ్డికి పోలైన ఓట్లు 147110
బీఆర్ఎస్ - మన్నె శ్రీనివాస్ రెడ్డికి పోలైన ఓట్లు 57109
9వ రౌండ్ ముగిసేసరికి 9758 ఓట్ల ఆదిక్యంలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ.
బీజేపీ-266187
కాంగ్రెస్- 284426
BRS- 104090
21వ రౌండ్ ముగిసే సరికి 18239 ఓట్ల తేడాతో ముందంజలో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్