అగ్నివీరులకు శుభవార్త చెప్పిన హర్యానా సర్కార్

అగ్నివీరులకు ఇది శుభవార్త. హర్యానా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ఏమిటి?

Update: 2024-07-17 10:57 GMT
హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ.

హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసు శాఖతో సహా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎంపికయ్యే కానిస్టేబుల్, మైనింగ్ గార్డ్, ఫారెస్ట్ గార్డ్, జైల్ వార్డెన్, SPO పోస్టుల్లో అగ్నివీర్లకు 10 శాతం రిజర్వేషన్‌ ఉంటుందని ఆయన చెప్పారు. 

అగ్నిపథ్ పథకం అంటే ఏమిటి?

కేంద్ర ప్రభుత్వం 2022 లో ఈ అగ్నిపథ్ పథకాన్ని తీసుకువచ్చింది. 18 నుంచి 21 సంవత్సరాల మధ్య వయసున్న యువతీ, యువకులను సైనికులు, వాయుసేన, నౌకాదళంలోకి తీసుకుంటారు. వీరిని అగ్నివీర్‌లుగా పిలుస్తారు. శిక్షణ అనంతరం నాలుగు సంవత్సరాల పాటు సర్వీస్‌లో ఉంటారు. ఆ తరువాత 25 శాతం మందిని సైన్యంలో కొనసాగిస్తారు. మిగిలిన 75 శాతం మంది సైన్యం నుంచి రిటైర్ కావాల్సి ఉంటుంది. ఇలా రిటైరయిన వీరికి ప్రభుత్వం వారికి కొంత మొత్తాన్ని ఏకమొత్తంగా చెల్లిస్తుంది.

అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు..

అగ్నివీరులు సాయుధ దళాల్లో పూర్తిస్థాయి సర్వీస్‌కు ఎంపిక కాకపోతే నాలుగేళ్ల సమయం వృధా అవుతుంది. ఆ సమయంలో బయట ఉండి చదువును కొనసాగించినట్లయితే ఏదైనా ఉపాధి పొందే అవకాశం ఉంటుందని, ఈ పథకం వల్ల యువకుల జీవితాలు నాశనమయ్యే అవకాశం ఉందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. 

Tags:    

Similar News