2024 మధ్యంతర బడ్జెట్ : పేద, మధ్యతరగతి వర్గాలపై వరాల జల్లు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేద, మధ్యతరగతి వర్గాలపై వరాల జల్లు కురిపించారు. 2024 మధ్యంతర బడ్జెట్ ను ఆమె లోక్ సభలో గురువారం ప్రవేశపెట్టారు.

Update: 2024-02-01 09:56 GMT

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేద, మధ్యతరగతి వర్గాలపై వరాల జల్లు కురిపించారు. 2024 మధ్యంతర బడ్జెట్ ను ఆమె లోక్ సభలో గురువారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ.. దేశంలో 80 కోట్ల మందికి రేషన్ దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ చేస్తామన్నారు. 2014లో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినపుడు దేశంలో ఎన్నో సమస్యలు ఉండేవని, వాటన్నింటిని అధిగమించామని పేర్కొన్నారు. రేషన్ బియ్యం పంపిణీ ఇంకా ఐదేళ్ల పాటు పొడిగిస్తామని గత ఏడాది అక్టోబర్ లో మోదీ చెప్పిన విషయాన్ని నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు.

సౌరశక్తిని ప్రోత్సహిస్తాం..

ఖరీదుగా మారిన విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు దేశంలో సౌరశక్తిని ప్రోత్సహిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశంలోని కోటి ఇళ్లకు సోలార్ వెలుగులు కల్పిస్తామన్నారు. ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తామని స్పష్టం చేశారు. రూఫ్ టాప్ సోలార్ పథకం కింద లబ్ధిదారులకు ఈ మేరకు సహాయం చేస్తామని ప్రకటించారు. దేశంలో విద్యుత్ సమస్యను ఎదుర్కోవడానికి ఇది చాలా సహాయపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా గృహ వినియోగదారులకు ఏటా రూ. 15వేల నుంచి రూ.18 వేల వరకు ఆదా అవుతుందని నిర్మలా తెలిపారు.

దేశంలో మరిన్ని వైద్య కళాశాలలకు అనుమతి ఇస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. ఆశా వర్కర్లందరికీ ఆయుష్మాన్‌ భారత్‌ అమలు చేస్తామని హామీ ఇచ్చిన నిర్మలా సీతారామన్ పశ్చిమ ఆసియా కారిడార్‌ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి గేమ్‌ ఛేంజర్‌గా మారిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News