బెల్టు షాపులు మూసేస్తున్నారా, ఈ 10 సూచనలు మర్చిపోవద్దు

బెల్టు షాపులు మూసేయాలన్నది చాలా మంచి నిర్ణయం, సీరియస్ నిర్ణయం. ఇందులో ప్రజా ప్రమేయం, ముఖ్యంగా మహిళల ప్రమేయం ఉండాలంటున్నది రైతు స్వరాజ్యం వేదిక. ఎలాగంటే...

Update: 2023-12-13 07:35 GMT
తెలంగాణలో వీధివీధికి మందు అందుబాటులోకి తెచ్చిన బెల్ట్ షాపులు బంద్

తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా ప్రజలలో మద్యం అలవాటును తగ్గించాలంటే తక్షణమే అన్ని గ్రామాలలో, బస్తీల్లో బెల్టు షాపులను రద్దు చేసేందుకు చేసిన ప్రకటనలను రైతు స్వరాజ్య వేదిక స్వాగతించింది. అయితే, బెల్టు షాపుల మూసివేత దారి తప్పకుండా ఉండాలంటే

వాటిని మూత వేయించే కార్యక్రమంలో ప్రజా సంఘాలు చురుకుగా పాల్గొనాలని ఈ సంస్థ ప్రతినిధి కన్నెగంటి రవి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల ప్రమేయంతో ముఖ్యంగా మహిళ ప్రమేయంతో చేయాలని ఈ సంస్థ కొన్ని సూచనలు చేసింది. ఆ సూచనలు:

1. బెల్టు షాపులు రద్దు నిర్ణయం అమలు దారి తప్పకుండా స్థానిక మహిళలతో, మహిళా సంఘాల ప్రతినిధులతో , మహిళా ప్రజా ప్రతినిధులతో కమిటీలు వేయాలి.

2.మద్యం అమ్మకాలను తగ్గించే వైపు మరిన్ని చర్యలు చేపట్టాలి. మద్యం దుకాణాలు తెరిచి ఉంచే సమయాలను గణనీయంగా తగ్గించాలి.

3. స్కూల్స్, ఆసుపత్రులు, దేవాలయాలకు అర కిలోమీటర్ దూరంలో, రాష్ట్ర, జాతీయ రహదారుల వెంట మద్యం దుకాణాలకు ఇచ్చిన లైసెన్సులను రద్దు చేయాలి.

4. మద్యం అమ్మే బార్లు, రెస్టారెంట్స్ సమయాలను సాయంత్రం 6 నుండీ రాత్రి 10 గంటలకే పరిమితం చేయాలి. పగలు పూట వైన్స్ దుకాణాలు బంద్ చేయించాలి

5. సెలబ్రిటీస్ , మేధావులు, విద్యావేత్తలతో, మద్యానికి వ్యతిరేకంగా ప్రభుత్వమే ప్రకటనలు తయారు చేయించి టీవీల ద్వారా విస్తృత ప్రచారం సాగించాలి.

6. రాష్ట్ర స్థాయి నుండీ, గ్రామ స్థాయి వరకూ ప్రజా ప్రతినిదుల సమావేశాలలో మద్యానికి దూరంగా ఉంటామని ప్రమాణం చేయించాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా గ్రామ స్థాయిలో ఈ బెల్టు షాపుల రద్దు కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలి.

7. మండల స్థాయి PHC లలో మద్యం బాధితుల కోసం డీ అడిక్షన్ సెంటర్లను (Deaddiction Centres) ప్రారంభించాలి.

8. ప్రభుత్వ సాంస్కృతిక శాఖ కళాకారులతో గ్రామాలలో, బస్తీలలో మద్యానికి వ్యతిరేకంగా విస్తృతంగా ప్రచారం చేయాలి.

9. స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీ తదితర అన్ని చోట్లా యువతకు మద్యానికి, డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.

10. ప్రతి మూడు నెలలకు ఒకసారి రాష్ట్రంలోమద్యం అమ్మకాలు తగ్గుతున్నాయీ , లేనిదీ సమీక్షించి మరిన్ని నియంత్రణ చర్యలు చేపట్టాలి. రాబోయే కాలంలో పూర్తి మద్య నిషేధం వైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేయాలి.

Tags:    

Similar News