నాలుగు సంవత్సరాల తరువాత భారీగా తగ్గిన జీడీపీ వృద్ధిరేటు
సెకండ్ హఫ్ లో అంచనాలు అందుకోలేని వైనం;
By : The Federal
Update: 2025-01-07 12:29 GMT
ఈ ఆర్ధిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధిరేటు మందగించే అవకాశాలు కనిపిస్తున్నాయని, కేవలం 6.4 శాతానికి మాత్రమే పరిమితం అవుతుందని ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన గణాంకాలు తెలియజేశాయి.
ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు తొలుత 8.2 శాతంగా ఉంటుందని అంచనా వేసినప్పటికీ దేశీయంగా, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల కారణంగా వృద్ధిరేటు మందగించిందని నివేదిక స్ఫష్టం చేసింది. గడిచిన నాలుగు సంవత్సరాల్లో ఇదే అత్యల్ప జీడీపీ వృద్ధిరేటు అని తెలుస్తోంది.
ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్ లో ఆశించిన ఫలితాలు నమోదు చేయడంలో విఫలం అయింది. మొదటి క్వార్టర్ వృద్ధిరేటు 6.7 గా నమోదు అయినప్పటికీ రెండో క్వార్టర్ లో అది కేవలం 5.4 శాతానికే పరిమితమైంది. కోవిడ్ తరువాత అత్యల్ప వృద్ది రేటు నమోదయిన ఆర్థిక సంవత్సరంగా 2024-25 నిలవనుంది.
కారణాలు అనేకం..
వృద్దిరేటు తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి తగ్గడం, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికంగా అస్తవ్యస్థ పరిస్థితులు నెలకొనడం, దేశీయంగా అధిక ద్రవ్యోల్భణంతో వినియోగం తగ్గడం ఓకారణంగా చెప్పవచ్చు.
దేశంలో గత నాలుగు సంవత్సరాల్లో ఈ ఏడాదే అత్యల్ప వృద్దిరేటు నమోదు అయినప్పటికీ, ప్రపంచంలోనే మనదేశంలోనే గ్రోత్ రేట్ అధికంగా నమోదు అయింది. ప్రభుత్వం కీలక మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టడం, సంస్కరణలకు ప్రాధాన్యం ఇవ్వడం మరీ ముఖ్యంగా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహాకాలు అందించడంతో వచ్చే క్వార్టర్లలో వృద్ధిరేటు పెరిగే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.
అయితే వృద్ధిరేటుకు కొన్ని ప్రతిబంధకాలు సైతం ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా విద్యుత్ ధరలు పెరగడం, జియో పొలిటికల్ టెన్షన్స్, అస్థిరంగా వర్షాలు పడే అవకాశం ఉండటం వృద్ధి రేటుకు ప్రతికూలకంగా మారవచ్చని అభిప్రాయాలు వినిపిస్తున్నాయని ఎకనామిక్ అవుట్ లుక్ అభిప్రాయపడింది.
సదరు డేటా ప్రకారం దేశీయ డిమాండ్, ప్రయివేట్ పెట్టుబడులు, బాహ్య శక్తుల నుంచి ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను తట్టుకుని నిలబడితేనే సుస్థిరాభివృద్ధి సాధ్యమని అభిప్రాయపడింది.