రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా అనంత్ అంబానీ
మే 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించిన సంస్థ;
Translated by : Chepyala Praveen
Update: 2025-04-26 10:35 GMT
ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ మే 1 నుంచి వచ్చే ఐదేళ్ల కాలానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటేడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమితలయ్యారని కంపెనీ ప్రకటించింది.
రెండు సంవత్సరాల క్రితం అంటే ఆగష్టు 23 లో అంబానీ తన ముగ్గురు పిల్లలను రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు లో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా చేరారు.
ఇటీవల కాలంలో ఆసియాలోనే అత్యంత ధనవంతుడు, దేశంలోని అత్యంత విలువైన, లాభదాయకమైన కంపెనీ అయిన రిలయన్స్ లో వారి పిల్లలు ముఖ్యమైన పాత్రలు పోషించారని అంబానీ ప్రకటించారు.
పెద్ద కుమారుడు ఆకాశ్ 2014 లో ఆకాశ్ యూనిట్ లో చేరాడు. తరువాత జూన్ 2022 లో నుంచి టెలికాం విభాగం జియో ఇన్పోకమ్ కు చైర్మన్ గా ఉన్నారు. ఆకాశ్ కవల సోదరి ఇషా కంపెనీ రిటైల్, ఇ కామర్స్, లగ్జరీ వ్యాపారాలను నడుపుతోంది.
అనంత్ విదేశాల్లో న్యూ ఎనర్జీ వ్యాపారం నడుపుతున్నారు. ఈ ముగ్గురు రిలయన్స్ టెలికాం, డిజిటల్ ఆస్తులు కలిగి ఉన్న యూనిట్ అయిన జియో ప్లాట్ ఫామ్స్ , రిలయన్స్ రిటైల్ లో ఉన్నారు.
‘‘ఏప్రిల్ 25న జరిగిన రిలయన్స్ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో మానవ వనరులు, నామినేషన్, వేతన కమిటీ సిఫార్సుపై, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన అనంత్ ఎం. అంబానీని పరిగణించి, కంపెనీ సభ్యుల ఆమోదానికి లోబడి మే 1, 2025 నుంచి ఐదు సంవత్సరాల కాలానికి కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమించారు’’ అని రిలయన్స్ స్టాక్ ఎక్స్ ఛేంజ్ ఫైలింగ్ లో తెలిపింది.
బ్రౌన్ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడైన అనంత్ రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమితులైన అంబానీ సోదరులలో మొదటి వ్యక్తి. అనంత్ ఆగష్టు 2022 లో కంపెనీ ఎనర్జీ వర్టికల్ లీడర్ గా నియమితులయ్యారు.
ఆయన మార్చి 2020 నుంచి జియో ప్లాట్ ఫాం లిమిటెడ్ బోర్డులో మే 2022 నుంచి రిలయన్స్ వెంచర్స్ లిమిటెడ్ బోర్డులో, జూన్ 2021 నుంచి రిలయన్స్ న్యూ ఎనర్జీ లిమిటెడ్ అలాగే రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీ బోర్డులో కూడా ఉన్నారు. అలాగే సెప్టెంబర్ 2022 నుంచి రిలయన్స్ దాతృత్వ విభాగం అయిన రిలయన్స్ ఫౌండేషన్ బోర్డులో కూడా మెంబర్ గా ఉన్నారు.