‘పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోమనడం అవమానించడమే’

బీజేపీ నేత అమిత్ షా వ్యాఖ్యలను TMC సీనియర్ లీడర్ అభిషేక్ బెనర్జీ తప్పుబట్టారు. ‘మతువస్’లు పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోమని చెప్పడం వారిని అవమానించడమేనన్నారు.

Update: 2024-05-13 07:11 GMT

బీజేపీ అగ్రనేత అమిత్ షా ఇటీవల చేసిన వ్యాఖ్యలను TMC సీనియర్ లీడర్ అభిషేక్ బెనర్జీ తప్పుబట్టారు. ‘మతువస్’లు పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోమని చెప్పడం వారిని అవమానించడమేనన్నారు.

"బిజెపి నాయకుడు అమిత్ షా ఇక్కడికి వచ్చి, మతువస్‌ను 'శరణార్థులు'గా అభివర్ణించారు. కానీ నేను ఆయనకు ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మీలాగా, నాలాగా, వాళ్లంతా భారతీయ పౌరులే. వాళ్లంతా ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్నవారే. మాతువా సోదరులు, సోదరీమణులు కూడా ఈ దేశ పౌరులే. వాళ్లను పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పడానికి ముందు, బొంగావ్ సిట్టింగ్ ఎంపి శంతను ఠాకూర్ ఎందుకు తాజా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడం లేదు’’ అని ప్రశ్నించారు.

కోల్‌కతాకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సందేశ్‌ఖాలీ ఏరియాలో TMC నాయకుడు షాజహాన్ షేక్, అతని మద్దతుదారులపై భూకబ్జా, లైంగిక వేధింపుల కేసులు నమోదయిన విషయం తెలిసిందే. వారి తీరుకు వ్యతిరేకంగా ఫిబ్రవరిలో నిరసనలు కూడా వెల్లువెత్తాయి.

సందేశ్‌ఖాలీ విషయాన్ని ప్రస్తావిస్తూ.. "సందేశ్‌ఖాలీలో ఎలాంటి అత్యాచారం జరగలేదని మహిళలు ఇప్పుడు బయటకు వచ్చి నిజాన్ని వెల్లడిస్తున్నారు. కొంతమంది మహిళలతో ఖాళీ కాగితాలపై సంతకం చేయించుకుని నకిలీ రేప్ కేసులను నమోదు చేయించాలని కుట్రపన్నారు. ’’అని టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆరోపించారు.

"ఖాళీ కాగితాలపై సంతకం చేసి మోసపోయాం. మా పేర్లపై అత్యాచారం ఫిర్యాదులు నమోదయ్యాయని మాకు తర్వాత తెలిసింది.’’ అని ఒక మహిళ చెప్పిన వీడియోను TMC షేర్ చేసింది.

సందేశ్‌ఖాలీ నుంచి బయటకు వచ్చిన ఒక వీడియోలో..లైంగిక వేధింపులు, భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న స్థానిక టిఎంసి సత్రప్ షేక్, అతని సహాయకులకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న 70 మందికి పైగా మహిళలకు ఒక్కొక్కరికి రూ. 2వేలు అందజేసిన వీడియో వైరలైంది.

టిఎంసి ఆరోపణలను బిజెపి కొట్టిపారేసింది. సందేశ్ ఖాలీలో చక్కర్లు కొడుతున్న వీడియోలు సృష్టించబడినవని వాదిస్తోంది. సందేశ్ ఖాలీ వీడియో లీకుల వ్యవహారంలో కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.  

Tags:    

Similar News