అయోధ్యలో ఎన్ని ఏర్పాట్లో..

ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడుతోంది. దీంతో అధికారులు ఏర్పాట్లలో బిజీ అయ్యారు. పనుల్లో వేగం పెంచారు.

Update: 2024-01-13 06:29 GMT

ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం ఈ నెల 22వ తేదీన జరగనుంది. బాలరాముడి (రామ్ లల్లా) విగ్రహాన్ని కూడా అదే కూడా ప్రతిష్ఠించనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ సుందరీకరణ పనులు ఊపందుకున్నాయి. అదే క్రమంలో సరయూ నది పరివాహక ప్రాంతం విద్యుత్ దీప కాంతులను సంతరించుకోనుంది. ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా జనవరి 18 నుంచి అయోధ్యలో ప్రైవేట్ భవనాల నిర్మాణాలను తాత్కాలికంగా నిషేధించినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాల్ మాట్లాడుతూ ‘‘పర్యాటక ప్రదేశాల గురించిన సమాచారాన్ని భక్తులకు తెలిపేందుకు 250 మంది పోలీసు గైడ్‌లను నియమించాం. జనవరి 14న డిజిటల్ టూరిస్ట్ యాప్‌ను కూడా అందుబాటులోకి వస్తుంది. జనవరి 14 నుంచి 21 వ తేదీ వరకు అయోధ్య రామమందిరానికి వెళ్లే మార్గాల్లో పరిసరాల శుభ్రతపై ప్రచారం నిర్వహిస్తున్నాం. అన్ని కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నాం. సరయూ నదికి సమీపంలో 2 కిలోమీటర్ల పొడవునా కంచె ఏర్పాటు చేయాలని నీటిపారుదల శాఖను కోరాం’’ అని తెలిపారు.

సమాచార శాఖ రామచరిత మానస్ శ్లోకాల హోర్డింగ్‌లను ఏర్పాటు చేస్తుందని, నగరంలోని ముఖ్యమైన ప్రదేశాలలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేస్తామని దయాళ్ చెప్పారు. జనవరి 16 నుంచి 22 వరకు అయోధ్యలోని ప్రతి ఆలయంలో మతపరమైన వేడుకలు నిర్వహిస్తామని జనవరి 16 న రామ్‌కోట్‌లో నిర్మించిన అంతర్జాతీయ మీడియా సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News