మైక్రోసాఫ్ట్‌ ఎర్రర్‌తో నిలిచిన విమానయాన, ఆన్‌లైన్ సేవలు..

మైక్రోసాఫ్ట్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు బ్లూ స్క్రీన్‌ ఆఫ్‌ డెత్‌ ఎర్రర్‌ అనే మెసేజ్‌ వస్తోంది.;

Update: 2024-07-19 12:49 GMT

మైక్రోసాఫ్ట్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు బ్లూ స్క్రీన్‌ ఆఫ్‌ డెత్‌ ఎర్రర్‌ అనే మెసేజ్‌ వస్తోంది. భారత్‌ సహా అమెరికా, ఆస్ట్రేలియాలోనూ ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. ఫలితంగా ఆన్‌లైన్‌ సేవలు, ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌లపై తీవ్రప్రభావం పడుతున్నట్లు సోషల్‌మీడియాలో వార్తలొస్తున్నాయి. సాంకేతిక సమస్య కారణంగా ముంబయి, ఢిల్లీ ఎయిర్‌పోర్టుల్లో ఇండిగో, స్పైస్‌జెట్‌, ఎయిరిండియా సర్వీసులు నిలిచిపోయాయి.

అంతరాయంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌..

మైక్రోసాఫ్ట్ సర్వర్‌లో సాంకేతిక సమస్య వల్ల భారత్‌ పలు రంగాలపై ప్రభావం పడింది. దాంతో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ కీలక ప్రకటన చేశారు.‘ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌లో ఏర్పడ్డ అంతరాయాన్ని పరిష్కరించేందుకు భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మైక్రోసాఫ్ట్‌తో సంప్రదింపులు జరుపుతోంది. అంతరాయానికి కారణం ఏమిటో గుర్తించారు. సమస్య పరిష్కారానికి కూడా ప్రక్రియ ప్రారంభమైందని మంత్రి తెలిపారు. అలాగే సమస్య పరిష్కారానికి కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌ (CERT) మైక్రోసాఫ్ట్‌కు పలు కీలక సూచనలు చేసినట్లు మంత్రి ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. కాగా అంతరాయంపై మైక్రోసాఫ్ట్‌ సైతం అధికారికంగా ప్రకటించింది. నిరంతరం సేవలను మెరుగుపరుస్తున్నామని మైక్రోసాఫ్ట్ తెలిపింది. సమస్యను సరిదిద్దేందుకు అనేక బృందాలు పని చేస్తున్నాయని, ఇందుకు గల కారణాలను తెలుసుకుంటున్నామని తెలిపింది. ఈ సమస్య మరోసారి ఉత్పన్నం కాకుండా చూస్తామని పేర్కొంది.

Tags:    

Similar News