అయోధ్య రామాలయ ఉత్సవాలు కేరళలో నిషేధించారా?

అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో పార్టీలు వేడుకలు నిర్వహిస్తున్నారు. కాని కేరళలో మొదలుకాకపోవడానికి కారణమేంటి?

Update: 2024-01-08 08:09 GMT

బీజేపీ కేరళ చీఫ్‌ ‌కే సురేంద్రన్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీపై విరుచుకుపడ్డారు. జనవరి 22న అయోధ్యలోని రామమందిరంలో జరిగే వేడుకలకు సంబంధించి.. కేరళలో కాంగ్రెస్‌ ‌పార్టీ తరుపున కార్యక్రమాలు నిర్వహించకుండా హిందూ మనోభావాలను దెబ్బతిస్తున్నారని ఆరోపించారు.

ఉత్తరప్రదేశ్‌, ‌మధ్యప్రదేశ్‌, ‌కర్నాటకలో కాంగ్రెస్‌ ‌పార్టీ వేడుకలకు సన్నద్ధమవుతున్నాయని గుర్తుచేశారు. అయితే గ్రాండ్‌ ఓల్డ్ ‌పార్టీ కేరళలో ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు.

‘‘కేరళలో కాంగ్రెస్‌ ‌పార్టీ వైఖరి భిన్నంగా ఉంది. హిందువుల విశ్వాసాల పట్ల ఆ పార్టీకి బాధ్యత లేదా? వారి మనోభావాలను పట్టించుకోరా?

ఇండియన్‌ ‌యూనియన్‌ ‌ముస్లిం లీగ్‌ ‌లేదా పీఎఫ్‌ఐకు భయపడి వేడుకల నిర్వహణకు వెనుకంజ వేస్తున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘వేడుకలు జరుపుకోవడానికి తాము ఎవరికీ వ్యతిరేకం కాదని ఐయుఎంఎల్‌ ‌స్పష్టంగా చెప్పిందని, కేరళకు చెందిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో పాటు కేరళ ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ ‌కమిటీ చీఫ్‌ ‌కె సుధాకరన్‌, ‌తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సురేంద్రన్‌ ‌డిమాండ్‌ ‌చేశారు.

కేరళలో నిర్వహించే వేడుకల్లో బీజేపీ పాల్గొంటుందని, అందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని దేవాలయాల వద్ద కూడా పరిశుభ్రత కార్యక్రమాలు చేపడతున్నామని చెప్పారు.

సాంప్రదాయ నాగర శైలిలో నిర్మించిన రామాలయ ఆలయాన్ని 380 అడుగుల పొడవు (తూర్పు-పడమర దిశ), 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆలయంలోని ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. మొత్తం 392 స్తంభాలు, 44 ద్వారాలు ఉంటాయి.

Tags:    

Similar News