DELHI POLLS | మరింత బాగా కొట్టుకోండి! ఒమర్ అబ్దుల్లా సెటైరికల్ ట్వీట్
Delhi లో సీట్ల సర్ధుబాటు కుదరక ఆప్, కాంగ్రెస్ వేర్వేరుగా పోటీ చేసి రెండూ దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో J&K CM ఒమర్ అబ్దుల్లా పోస్టుకి ప్రాధాన్యత సంతరించుకుంది.;
By : The Federal
Update: 2025-02-08 06:29 GMT
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) ఓ సెటైరికల్ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఎక్స్ మాధ్యమంలో ఉన్న ఈ పోస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తెగ వైరల్ అవుతోంది. ఒమర్ అబ్దుల్లా ఒక మీమ్‌ను ఉపయోగిస్తూ ట్వీట్ చేశారు. ఆ మీమ్‌కి "మీలో మీరు కొట్టుకోండి'' అనే క్యాప్షన్ ఇచ్చారు. దీని ప్రకారం చూస్తే ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కూటమి పార్టీల మధ్య వివాదాల కారణంగా ప్రజలు ప్రత్యామ్నాయ పార్టీ వైపు మొగ్గు చూపారని చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది.
ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలు ముందు కలిసి పోటీ చేయాలనుకున్నాయి. ఆ తర్వాత విభేదాలు వచ్చాయి. వేర్వేరుగా పోటీ చేశాయి. ఆమ్ ఆద్మీ ఇస్తామన్న 6 సీట్లకు కాంగ్రెస్ ససేమిరా అంది. మొత్తం 70 అసెంబ్లీ సీట్లలో 50 సీట్లకు గట్టి అభ్యర్థులను నిలబెట్టింది. ఇప్పుడా సీట్లలో కాంగ్రెస్ పార్టీకి సుమారు 7 శాతం ఓట్లు రాగా అవి ఆప్ గెలుపు అవకాశాలను దెబ్బతీశాయి.
నిజానికి ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమిలో ఉన్నాయి. సీట్ల సర్ధుబాటు కుదరక వేర్వేరుగా పోటీ చేసి రెండూ దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఒమర్ అబ్దుల్లా పోస్టుకి ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎస్పీ, తృణమూల్ ఆప్ వైపు...
ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలైన సమాజ్‌వాదీ పార్టీ (SP), తృణమూల్ కాంగ్రెస్ (TMC) వంటి పార్టీలు కాంగ్రెస్‌ను కాదని ఆప్‌కు మద్దతు ప్రకటించాయి. అయితే, కాంగ్రెస్ పార్టీ తన స్వంతంగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో, మైనారిటీ ఓట్లు, ముఖ్యంగా ముస్లిం ఓట్లు, ఆప్, కాంగ్రెస్ మధ్య చీలిపోయాయి. ఈ ఓట్ల విభజన బీజేపీకి లాభంగా మారింది. ఆప్ ఓటమికి కేవలం కాంగ్రెస్ కారణమనే చెప్పడం సరికాదు. ఆప్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలు, ముఖ్యంగా లిక్కర్ స్కాం వంటి అంశాలు, ఆ పార్టీపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. అదేవిధంగా, బీజేపీ తన ప్రచారంలో పూర్వాంచల్ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక వ్యూహాలు అమలు చేసింది. కాబట్టి, ఆప్ ఓటమికి కాంగ్రెస్ కారణమని చెప్పడం కంటే, వివిధ అంశాల సమ్మిళిత ప్రభావం కారణంగా ఆప్ ఓటమి చెందిందని చెప్పడం సముచితం.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి:
కాంగ్రెస్ పోటీ చేయడం వల్ల మైనారిటీ ఓట్లు, ముఖ్యంగా ముస్లిం ఓట్లు, ఆప్ నుంచి కొంత మేరకు దూరమయ్యే అవకాశం ఉంది. ఇది ప్రత్యక్షంగా బీజేపీకి లాభంగా మారింది.
లిక్కర్ స్కాం, అవినీతి ఆరోపణలు, అరెస్టులు వంటివ ఆప్ నేతలపై ప్రజల్లో కొంత నెగటివ్ ఇమేజ్‌ను కలిగించాయి. అవినీతి ఆరోపణలు నిజమా కాదా అన్నదాన్ని నిర్ధారించాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థ మీద ఉన్నా, రాజకీయంగా ఇది ఆప్‌కు నష్టం కలిగించింది.
బీజేపీ వ్యూహం & మోడీ ప్రభావం: బీజేపీ హిందూత్వ బ్రాండ్, మోడీ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం—ఇవి కొంతవరకు ఢిల్లీ ఓటర్లను ప్రభావితం చేశాయి.