బిల్కిస్‌ బానో కేసులో సంచలన తీర్పు..11 మంది మళ్లీ జైలుకు వెళ్లాల్సిందే

బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గ్యాంగ్ రేప్ కేసులో 11 మంది దోషుల క్షమాభిక్షను రద్దు చేసింది.

Update: 2024-01-08 05:59 GMT

బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో 11 మంది దోషుల క్షమాభిక్షను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. గుజరాత్ ప్రభుత్వానికి క్షమాభిక్ష ఇచ్చే అధికారం లేదని స్పష్టం చేసింది. బిల్కిస్ బానో పిటిషన్ విచారణకు అర్హత ఉందని పేర్కొంది. కేసులో 11 మంది దోషులకు క్షమాభిక్ష కల్పించడాన్ని బాధితురాలు సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే.

2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్‌లో అల్లర్లు జరిగినప్పుడు ఈ అత్యాచార ఘటన చోటుచేసుకుంది. బిల్కిస్‌ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు హత్య చేశారు. ఆ సమయంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది. గతేడాది ఆగస్టు 15న వారు విడుదలయ్యారు.

ఇదీ జరిగింది..

గోద్రా ఘటన నేపథ్యంలో చెలరేగిన అల్లర్ల సమయంలో బిల్కిస్​ బానో వయస్సు 21ఏళ్లు. అప్పటికి ఆమె 5 నెలల గర్భవతి. అల్లర్లలో.. ఏడుగురు కుటుంబసభ్యులను కోల్పోయింది బిల్కిస్​ బానో. వారిలో తన 3ఏళ్ల కుమార్తె కూడా ఉండి. అంతేకాకుండా.. ఆ నాడు, ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది.

బిల్కిస్​ బానో కేసు దర్యాప్తును గుజరాత్​ నుంచి ముంబైకి తరలించారు. కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లింది. 11మంది నిందితులను జీవిత ఖైదు చేయాలని 2008లో తీర్పునిచ్చింది స్పెషల్​ కోర్టు. ప్రత్యేక కోర్టు తీర్పును 2017లో బాంబే హైకోర్టు డివిజన్​ బెంచ్​ సమర్థించింది.

అయితే.. 2022 ఆగస్ట్​ 15న.. 11మంది నిందితులకు ఉపశమనాన్ని కల్పిస్తూ, వారిని జైలు నుంచి విడుదల చేసింది గుజరాత్​ హైకోర్టు. ఈ వ్యవహారంపై బిల్కిస్​ బానో వేసిన పిటిషన్​.. సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. అదే సమయంలో.. మహిళకు మద్దతుగా.. అనేక మంది కూడా పిటిషన్లు దాఖలు చేశారు.

Tags:    

Similar News