బడ్జెట్: రైతులు, మహిళలు, గిగ్ వర్కర్లపై వరాలు

కొత్తగా పదివేల మెడికల్ సీట్లు, ఎస్సీ, ఎస్టీలకు రూ. 2 కోట్ల టర్మ్ లోన్;

Update: 2025-02-01 07:37 GMT

కేంద్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టింది. బడ్జెట్ ప్రారంభం సందర్భంగా తెలుగు కవి గురజాడ అప్పారావు రాసిన ‘‘ దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్’’ అని సూక్తిని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు.

అందరూ అనుకున్నట్లుగానే బడ్జెట్ లో పేద, మధ్యతరగతి వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మహిళలు,యువత, రైతుల, పేదల లక్ష్యంగా కొన్ని పథకాలకు శ్రీకారం చుట్టారు.

బడ్జెట్ లోని పది ప్రముఖ అంశాలు..
1. 2025-26 బడ్జెట్ నాలుగు కీలక రంగాలపై దృష్టి సారిచింది. మహిళలు, యువత, రైతులు, పేదలు లక్ష్యంగా పథకాలు ప్రవేశపెట్టింది.
2. సూక్ష్మ,చిన్నతరహా పరిశ్రమల వర్గీకరణ కోసం పెట్టుబడి, టర్నోవర్ పరిమితిని తగ్గిస్తామంది.
3. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఉత్పేరకం ఇవ్వడానికి 1.5 లక్షల గ్రామీణ తపాలా కార్యాలయాలతో పెద్ద పబ్లిక్ లాజిస్టిక్స్ సంస్థగా ఇండియా పోస్టును రూపొందించనున్నారు.
4. క్రెడిట్ యాక్సిస్ను మెరుగుపరచడానికి ఎంఎస్ఎంఈల కోసం క్రెడిట్ గ్యారెంటీ కవర్ తీసుకురానున్నట్లు వెల్లడించారు.
5. స్టార్టప్ లోసం ప్రభుత్వం నుంచి రూ.10 వేల కోట్లతో పెద్ద నిధిని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
6. 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ పారిశ్రామకవేత్తలకు రూ. 2 కోట్ల టర్మ్ లోన్ ను అందించనున్నారు.
7. పాదరక్షలు, తోలురంగాలను ప్రొత్సహించడానికి కొత్తగా కేంద్రీకృత పథకం తీసుకువస్తామని చెప్పారు.
8. ఎస్ఎంఈలకు, పెద్దపరిశ్రమల కోసం తయారీ మిషన్ ను ఏర్పాటు
9. కోటిమంది పైగా గిగ్ కార్మికుల కోసం కొత్తగా సామాజిక భద్రతా పథకం
10 . దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో 10 వేల అదనపు సీట్లు
Tags:    

Similar News