ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మే 13న... షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల కమిషన్

దేశంలో ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్‌ను చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ విడుదల చేశారు. వివరాలు

Update: 2024-03-16 10:43 GMT
Source: Twitter


దేశంలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. దేశమంతా ఎదురుచూస్తున్న లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను జాతీయ ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ విడుదల చేశారు. విజ్ఞానభవన్ ప్లీనరీ హాల్‌లో ఎన్నికల కమిషనర్లు జ్ఞనేశ్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధుతో కలిసి రాజీవ్ షెడ్యూల్‌ను ప్రకటించారు. 18వ లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయని వెల్లడించారు. 2024 ఏడాదిని ప్రపంచమంతా ఎన్నికల ఏడాదిగా పిలుస్తోందని గుర్తు చేశారు. ఈ ఏడాదిలో భారత్ సహా పలు దేశాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో ఖాళీ అయిన సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను కూడా ప్రకటించారు.



దేశ వ్యాప్తంగా 7 దశల్లో పోలింగ్

– ఏప్రిల్ 19న తొలిదశ ఎన్నికలు

– ఏప్రిల్ 26న రెండో దశ పోలింగ్

– రెండో దశలో 21 రాష్ట్రాల్లో పోలింగ్

– మే 7న మూడో దశ పోలింగ్ – మే 13న నాల్గో దశ పోలింగ్

– మే 13నే ఏపీ, తెలంగాణలో పోలింగ్

– మే 20న ఐదో దశ పోలింగ్

– మే 25న ఆరోదశ పోలింగ్

– జూన్ 1న ఏడో దశ పోలింగ్





ఎన్నికలకు సిద్ధం


దేశంలో నిష్పక్షపాతంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు రాజీవ్. ఈ సారి ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘17వ లోక్‌సభ పదవీకాలం జూన్ 16, 2024తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే 18వ లోక్‌సభ ఎన్నికలకు దేశం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 49.7 కోట్ల మంది, మహిళా ఓటర్లు 47.1 కోట్ల మంది వరకు ఉన్నారు. ఎన్నికల కోసం 10.5 లక్షల పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ ఎన్నికల నిర్వహణ కోసం రెండేళ్లుగా సంసిద్దమయ్యాం. ఈ ఎన్నికలు అత్యంత పారదర్శకంగా జరుగుతాయి’’అని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే వారెవరైనా కఠిన చర్యలు తప్పవని, ఈ చర్యలు తీసుకోవడంలో ఏమాత్రం కనికరం లేకుండా వ్యవహరిస్తామని హెచ్చరించారు.




ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ ఏప్రిల్‌ 18న.

ఎన్నికలు మే 13.

ఓట్ల లెక్కింపు. జూన్‌ 4.

అంటే ఏపీ ఎన్నికలు దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో 4వ ఫేజ్‌లో జరుగుతాయి.

తెలంగాణ ఎంపీ ఎన్నికలు కూడా అదే రోజు.

మొత్తం ఓట్ల లెక్కింపు జూన్‌ 4న. జరుగుతాయి.


అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్


దేశంలో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ పదవీకాలం జూన్ నెలలో ముగియనుంది. ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కూడా పాలర్లమెంటు ఎన్నికలతో కలిపే నిర్వహిస్తామని చెప్పారు. ‘‘ఆంధ్ర ఎన్నికల నోటిఫికేషన్ 18 ఏప్రిల్‌న వస్తుందని, పోలింగ్ 13 మేన జరుగుతుంది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో నోటిఫికేషన్ మార్చి 20న విడుదలవుతుంది. 19 ఏప్రిల్‌న పోల్ నిర్వహిస్తాం. జూన్ 4న అన్ని రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది’’అని తెలిపారు.


లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ఇదే


లోక్‌సభ ఎన్నికలు గత ఎన్నికల తరహాలోనే ఏడు దశల్లో నిర్వమిస్తామని, ఇవి 19 ఏప్రిల్ నుంచి 1 జూన్ మధ్య జరుగుతాయని ప్రకటించారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. తొలి దశ ఎన్నికలు 19 ఏప్రిల్, రెండో దశ 26 ఏప్రిల్, మూడో దశ 7 మే, నాలుగో దశ 13 మే, ఐదో దశ 20 మే, ఆరో దశ 25 మే, ఏడో దశ 1 జూన్‌న పోలింగ్ జరుగుతుంది. అన్ని ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 4న జరుగుతుంది’’అని ఆయన వెల్లడించారు.


అభ్యర్థుల బడ్జెట్ ఫిక్స్ చేసిన ఈసీ

పార్లమెంట్ అభ్యర్థులు రూ.90 లక్షల వరకు ఖర్చు పెట్టొచ్చు

అసెంబ్లీకి పోటీ చేసే వారు రూ.38 లక్షల వరకు ఖర్చు పెట్టొచ్చు




Tags:    

Similar News