విమానాశ్రయాలు, వీఐపీల రక్షణకు మహిళా సీఐఎస్ఎఫ్ బెటాలియన్లు : కేంద్రం
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని కీలక విమానాశ్రయాలు, మెట్రోలు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల బాధ్యతలను సీఐఎస్ఎఫ్ లోని మహిళా బెటాయలియన్లు..
By : The Federal
Update: 2024-11-13 10:23 GMT
మహిళలను యుద్ధ విమానాల పైలట్ గాను, కేంద్ర సాయుధ బలగాల్లోనూ విధుల నిర్వహణకు ఉపయోగిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి మొత్తం మహిళలతో కూడిన సీఐఎస్ఎఫ్(CISF) బెటాలియన్ విమానాశ్రాయాలు, మెట్రో వ్యవస్థల వంటి కీలక మౌలిక సదుపాయాలను పరిరక్షించడానికి కేంద్రం అనుమతి మంజూరు చేసింది. అలాగే వీఐపీ భద్రతా కమాండోలుగా పనిచేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం వెయిమందితో కూడిన సెంట్రల్ ఇండ్రస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF) మొట్టమొదటి ఆల్ మహిళా బెటాలియన్ ను సోమవారం మంజూరు చేసింది. " దేశ నిర్మాణానికి సంబంధించిన ప్రతి రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించాలనే మోదీ జీ కల. దాన్ని సాకారం చేసే దిశగా ఒక దృఢమైన అడుగులో భాగంగానే, CISF మొదటి మొత్తం మహిళా బెటాలియన్‌ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది’’ అని షా సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్టు చేశారు.
దేశాన్ని రక్షించే కీలకమైన పనిలో మరింత మంది మహిళలు పాల్గొనాలనే ఆకాంక్షను ఈ నిర్ణయం ఖచ్చితంగా నెరవేరుస్తుందని హోంమంత్రి అన్నారు. సిఐఎస్‌ఎఫ్‌లో మహిళా సిబ్బంది 7 శాతానికి పైగా ఉన్నారు, వారి ప్రస్తుత బలం దాదాపు 1.80 లక్షలు గా ఉంది.