డ్రగ్స్ అంటే ఒక్కొక్కళ్ల కాళు వణకాలే!

మన పిల్లల భవిష్యత్ ఇది. రాజకీయాలు పక్కనబెట్టి అందరూ చేయి చేయిా కలుపుదాం. డ్రగ్స్ అనే మాట వినపడకుండా చేద్దాం రండి

Update: 2023-12-16 16:36 GMT
ప్రతీకాత్మక చిత్రం

`ఈ సమాజానికి పట్టిన చీడ, పీడ ఆ డ్రగ్స్. పంజాబ్ లో ఏమి జరుగుతుందో చూస్తున్నాం. అటువంటి డ్రగ్స్ మాట ఈ రాష్ట్రంలో వినపడకుండా చేయాలి. డ్రగ్స్ అంటేనే ఒక్కొక్కళ్లకి కాళ్లు వణకాలే. చిక్కితే బొక్కలో వేసి ఊచలు లెక్కించాల్సిందే’ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన మాట అది. ఆరో తరగతి పిల్లలు మొదలు ఎవరెవరో ఈ డ్రగ్స్ పాలిట పడి జీవితాల్ని కరాబు చేసుకుంటున్నారని, ఈ బెడదను తెలంగాణ నుంచి తరిమికొట్టాలన్నారు.

మెచ్చుకోవడానికి నోరు రాలేదు

అటువంటి మంచి అంశాన్ని గవర్నర్ ప్రసంగంలో పెట్టినా మెచ్చుకోవడానికి ఈ ప్రతిపక్షానికి మనసు రాలేద్నారు రేవంత్. కేసీఆర్ ప్రభుత్వమే సరైన డైరెక్షన్లో చర్యలు తీసుకుని ఉంటే ఈ మహమ్మారి తగ్గేదన్నప్పుడు కేటీఆర్ అడ్డుతగిలారు. డ్రగ్స్ ను కట్టడి చేసేందుకు కదిలిందే తామని చెప్పినప్పుడు రేవంత్ కస్సుమన్నారు. ‘డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాల పేరు ఈ రాష్ట్రంలోనే వినపడకూడదని మేము చెబుతుంటే కేటీఆర్ ఏదో మాట్లాడుతున్నారు. మీ ప్రభుత్వ హయాంలో ఏమి జరిగిందో కూడా చెబుతా. ఇదేదో నేనొక్కణ్ణి చేస్తే పోయేది కాదు. మొత్తం సభలో ఉన్న 119 మంది శాసనసభ్యుల బాధ్యత. బీఆర్ఎస్ ఉన్నప్పుడు సీవీ ఆనంద్ కి అడిషనల్ చార్జి ఇచ్చారు. 3100 సిబ్బంది కావాలంటే 31 ఇచ్చారు. 25 కోట్ల డబ్బులు కావాలంటే నయాపైసా ఇవ్వలే..టీఎస్ నాబ్ ను ఏర్పాటు చేసి వదిలేశారు. ఇప్పుడేమో అంతా మీరే చేసినట్టు చెబుతున్నారు. మీరు చేసిందేమీ లేదు. అది గతం. ఇప్పుడు దాన్ని సహించేది లేదు. మీరందరూ సహకరించాలి. ఎంతటి వాళ్లనైనా బొక్కలో వేస్తాం. డ్రగ్స్ అంటే కాళ్లు వణికేలా చేస్తాం ’ అని రేవంత్ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే మాటల సందర్భంలో హెచ్చరించారు. విమర్శల జోలికి వెళ్లకుండా తెలంగాణలో గంజాయి మొక్కలు, వనాలు మొలుస్తుంటే చూస్తూ ఉండకూడదన్నారు. వచ్చే పదేళ్లు తాము పాలించబోతున్నామని.. డ్రగ్స్‌తో తెలంగాణలోకి ఎవరు ఎంటరైనా ఊచలు లెక్కపెట్టాల్సిందే అని హెచ్చరించారు. డ్రగ్స్‌ నిర్మూలన విషయంలో కాంగ్రెస్ చాలా సీరియస్‌గా ఉందని స్పష్టం చేశారు. 

Tags:    

Similar News