శాస్త్రబద్ధంగానే అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం..
అసంపూర్తిగా నిర్మించిన ఆలయంలో విగ్రహ ప్రతిష్ట శాస్త్ర విరుద్ధమని కొందరు పీఠాధిపతులు భావిస్తుండగా.. ఇంకొందరు దాన్ని సమర్థిస్తున్నారు.
అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం, బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ ఈ నెల 22న జరుగుతున్నాయి. అయితే నిర్మాణం పూర్తికాకుండానే ఆలయం ప్రారంభం శాస్త్ర విరుద్దమని కొందరు పీఠాధిపతులు చెబుతున్నారు. కాగా ఈ వాదనను దూధేశ్వర్ మందిర్‌కు చెందిన మహంత్ నారాయణ్ గిరి తోసిపుచ్చారు. కొందరు దీన్ని భూతద్దంలో చూపడం విచారకరమన్నారు.
14 ఏళ్ల తర్వాత సోమనాథ్ ఆలయంలో కలశాన్ని, ధ్వజాన్ని ప్రతిష్టించారని, ఈ కార్యక్రమానికి అప్పటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ హాజరయ్యారు తెలిపారు. ఆలయ పునర్నిర్మాణంలో అప్పటి హోంమంత్రి సర్దార్ పటేల్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.
500 ఏళ్ల నిరీక్షణ, పోరాటం తర్వాత అయోధ్యలో ఆలయ నిర్మాణం జరిగిందని సరయూ ఆర్తి శశికాంత్ దాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కలను సాకారం చేసిన ప్రధాని నరేంద్ర మోదీని అభినందించాల్సిందేనని అన్నారు.
బాలరాముడి విగ్రహ ప్రతిష్టోత్సవాన్ని ఎవరూ ఇష్యూ చేయవద్దని ఆధ్యాత్మిక నాయకురాలు దేవ్కీ నందన్ ఠాకూర్ కోరారు. అయోధ్య రామాలయ గర్భగుడి, ఆలయ మొదటి అంతస్థు పూర్తయ్యిందన్నారు. ఒక పుస్తకాన్ని ఉటంకిస్తూ.. 1951లో దాని గర్భగుడి కూడా పూర్త్తికానప్పుడు సోమనాథ్ వేడుక జరిగిందని గుర్తు చేశారు.