‘ఆ విషయంలో మాకు సహకరించండి’

“కావేరిపై మేం అఖిలపక్ష సమావేశం పెట్టుకున్నట్లుగానే.. తమిళనాడు కూడా సమావేశాన్ని నిర్వహించింది. మేం దానికి వ్యతిరేకం కాదు.”అని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే అన్నారు.

Update: 2024-07-16 13:32 GMT

మేకేదాటు ప్రాజెక్టుకు సహకరించాలని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి డీకే శివకుమార్ తమిళనాడును కోరారు. మేకేదాటు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వల్ల తమ రాష్ట్రం కంటే తమిళనాడుకే ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

“మేకేదాటు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వల్ల మాకంటే తమిళనాడుకే ఎక్కువ ఉపయోగం. ఇందులో నిల్వ ఉంచిన నీటిని అవసరమైనపుడు తమిళనాడుకు విడుదల చేయవచ్చు. బెంగుళూరులో కన్నడిగులు, తమిళులు, ఆంధ్రులందరికి ఈ ప్రాజెక్టు వల్ల మేలు చేకూరుతుంది. అందుకే సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా' అని విధానసౌధలో విలేఖరులతో అన్నారు డీకే.

“కావేరిపై మేం అఖిలపక్ష సమావేశం పెట్టుకున్నట్లుగానే.. తమిళనాడు కూడా సమావేశాన్ని నిర్వహించింది. మేం దానికి వ్యతిరేకం కాదు.” అని డీకే అన్నారు.

“సోమవారం నుంచి రాష్ట్రంలో వర్షాలు పుంజుకున్నాయి. కావేరి బేసిన్ రిజర్వాయర్లలో ఇన్ ఫ్లో పెరిగింది. హారంగి జలాశయం నుంచి 20 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నాం’’ అని చెప్పారు.

వర్షాలు ఇలాగే కొనసాగితే తమిళనాడుకు నీటిని విడుదల చేస్తారా? అని అడిగిన ప్రశ్నకు..“తప్పకుండా నీటిని విడుదల చేస్తాం. నీటి మట్టం పెరిగినప్పుడు విడుదల చేయాల్సిందేనని’’ శివకుమార్ పేర్కొన్నారు.

ఆయన కర్ణాటకను పట్టించుకోరు..

కేవలం జీడిపప్పు, ఎండు ద్రాక్ష తినడం కోసం అఖిలపక్ష సమావేశానికి హాజరు కాకూడదని కేంద్ర మంత్రి కుమారస్వామి చేసిన ప్రకటనపై డీకే స్పందించారు. “మేము జేడీఎస్ పార్టీ ప్రతినిధులను జీడిపప్పు, ఎండు ద్రాక్ష తినమని పిలవలేదు. అలా అయితే పార్టీ ప్రతినిధులను సమావేశానికి ఎందుకు పంపారు? 'హిట్ అండ్ రన్' వ్యాఖ్యల్లో స్పెషలిస్ట్ అయిన కుమారస్వామి కర్ణాటక గురించి పట్టించుకోడు’’ అని అన్నారు.

కుమారస్వామి మీపై ఎందుకు వ్యక్తిగత దాడికి దిగుతున్నారని ప్రశ్నించగా.. “అది అసూయ. ఆయనకది అలవాటు. అన్ని విషయాలపై బహిరంగ చర్చకు ఆయన సిద్ధంగా లేరు. గత అసెంబ్లీ సెషన్‌లో ఆయనతో చర్చించాలనుకున్నప్పుడు కూడా ఆయన సమావేశానికి రాలేదు.

Tags:    

Similar News