పాక్ ఓవరాక్షన్ పై క్రికెటర్ చాహల్ కి కోపమొచ్చింది..
చహల్ ఓ విభిన్నమైన వ్యక్తి. ఆట మొదలు యుద్ధం వరకు దేన్నీ వదలకుండా ఫాలో అవుతుంటాడు. కామెంట్లు చేస్తుంటాడు...;
By : The Federal
Update: 2025-05-11 05:21 GMT
దేశానికి రాజైనా తల్లికి బిడ్డే అన్నట్టుగా ఆయన ప్రముఖ క్రికెటరే అయినా భారతీయుడేనని నిరూపించాడు. అతడే చాహల్. ఇండో పాక్ యుద్ధ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించడం పట్ల ఈ కుర్ర క్రికెటర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాక్ స్వభావం మారదంటూ సీరియస్ అయ్యాడు చాహల్. శత్రుదేశాన్ని కుక్క తోకతో పోల్చాడు చాహల్.
కుక్క తోకకు రాయి కట్టినా దాని తీరు మారదని.. అది వంకరగానే ఉంటుందన్నాడు. పాక్‌కు బుద్ధిరాదని సెటైర్ వేశాడు. చాహల్‌తో పాటు మరో క్రికెటర్ రాహుల్ తెవాటియా, భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా కుక్క తోక వంకర.. అది మారదంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో సేమ్ పోస్ట్ షేర్ చేశారు. చెత్త దేశం తమ నిజస్వరూపం ఏంటో అందరి ముందు మరోమారు చూపించిందంటూ పాక్‌ను దుయ్యబట్టారు మరో భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్. ఇలా పలువురు టీమిండియా స్టార్లు సీజ్‌ఫైర్ మీద తమదైన రీతిలో స్పందించారు. భారత స్టార్ల రియాక్షన్‌పై నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాక్‌ను ఎంత తిట్టినా తప్పులేదని.. యుద్ధం చేతగాక కాళ్లబేరానికి వచ్చారని అంటున్నారు. సీజ్‌ఫైర్‌కు ఒప్పించి ఉల్లంఘించడం ఏంటని సీరియస్ అవుతున్నారు.