ఢిల్లీ ఎన్నికల ఫలితాలు: ఆధిక్యంలో బిజెపి

హ్యాట్రిక్ కొట్టాలనుకున్న ఆప్ వెనబడుతూ ఉంది;

Update: 2025-02-08 03:21 GMT


న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు  ప్రారంభమైనంది. ఇంతవరకు అందిన ఫలితాల ప్రకారం బిజెపి ఆప్ కంటే ముందంజలో ఉంది. ఢిల్లీ కైవసం చేసుకునేందుకు బిజెపి ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తో హోరాహోరిగా తలపడుతూ ఉంది.ఆప్ దేశ రాజధానిలో హ్యాట్రిక్ సాధించాలని ఆశిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఎన్నికలలో బిజెపి విజయాన్ని సూచించాయి.

ఉదయం 8:30 గంటలకు, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ముందుకు సాగింది, కానీ బీజేపీ తన ఆధిక్యాన్ని తిరిగి స్థాపించుకోవడానికి కసరత్తు చేసింది. తుడిచి పెట్టుకుపోవడం ఖాయం అనుకున్న కాంగ్రెస్ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది.


ఉ. 8.45కు బిజెపి 37 స్థానాలలో, ఆఫ్ 26 స్థానాలలోొ ఆధిక్యంలో ఉన్నాయి.

2013లో ఢిల్లీలో ఆప్  తొలిసారి అధికారంలోకి వచ్చి 28 సీట్లు గెలుచుకుంది, కానీ ప్రభుత్వం కేవలం 49 రోజులు మాత్రమే కొనసాగింది. 2015 ఎన్నికల్లో ఆ పార్టీ రికార్డు స్థాయిలో 67 సీట్లు గెలుచుకుంది. 2020 ఎన్నికల్లో ఆప్ 62 సీట్లు గెలుచుకుంది.

చాణక్య స్ట్రాటజీస్ అంచనా ప్రకారం ఆప్ కు 25-28 సీట్లు, బీజేపీకి 39-44 సీట్లు, కాంగ్రెస్ కు మూడు సీట్లు వస్తాయి. డీవీ రీసెర్చ్ అంచనా ప్రకారం ఆప్ 26-34, బీజేపీ 36-44, కాంగ్రెస్ 0 సీట్లు గెలుచుకుంటాయి.

ఢిల్లీ ఎన్నికల మీద లైవ్ డిస్కషన్ ఇక్కడ అందుబాటులో ఉంది.








Tags:    

Similar News