ధర్మశాల టెస్ట్: చరిత్రలో తొలి పేస్ బౌలర్ గా ‘జేమ్స్ అండర్సన్’
ధర్మశాల టెస్ట్ లో ఇంగ్లండ్ పేస్ బౌలర్ జేమ్స్ అండర్సన్ అరుదైన క్లబ్ లోకి అడుగుపెట్టాడు. కుల్దీప్ యాదవ్ ను అవుట్ చేసి 700 వికెట్ల మైలురాయిని చేరాడు..ఇంకా..
ధర్మశాల టెస్ట్ లో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనత అందుకున్నాడు. కుల్దీప్ యాదవ్ ను అవుట్ చేయడం ద్వారా 700 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 30 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కుల్దీప్ కీపర్ బెన్ ఫోక్స్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు సంబరాలు జరుపుకున్నారు.
ఇప్పటి వరకూ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఏ పేస్ బౌలర్ ఈ ఘనత సాధించలేదు. 41 ఏళ్ల వయస్సులో ఇంకా ఫిట్ నెస్ కొనసాగిస్తూ ఇప్పటికీ టెస్ట్ క్రికెట్ కు అండర్సన్ తన సేవలు అందిస్తున్నాడు. అయితే ఓవరల్ గా అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా మాత్రం స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ ముందున్నాడు. మురళీ ఏకంగా 800 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 133 టెస్ట్ మ్యాచ్ ల్లో నే ఈ ఘనత అందుకున్నాడు. ఇక రెండో స్థానంలో లెజెండరీ ఆసీస్ స్పిన్నర్ షేన్ వార్న్ ఉన్నాడు. అతడు 708 టెస్ట్ వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మూడో స్థానంలో జేమ్స్ అండర్సన్ ఉన్నాడు. కుల్దీప్ యాదవ్ ను అవుట్ చేయడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి ఫాస్ట్ బౌలర్ గా ఖ్యాతి కెక్కాడు.