మహాకుంభమేళా దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడిందా?
ప్రభుత్వ గణాంకాలు ఏం చెబుతున్నాయి?;
By : Sindhu Bhattacharya
Update: 2025-03-02 06:41 GMT
భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి వృద్ది బాటలోకి దూసుకుపోతున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం విడుదల చేసిన రెండవ ముందస్తు అంచనాల ప్రకారం మూడో త్రైమాసికంలో అంటే అక్టోబర్- డిసెంబర్ 2024- 25 నాటికి వృద్దిరేటు 6.2 శాతంగా ఉందని వెల్లడించింది. ఇంతకుముందు త్రైమాసికంలో వృద్దిరేటు 5.6 శాతంగా ఉంది.
జాతీయ గణాంక కార్యాలయం(ఎన్ఎస్ఓ) తాజాగా విడుదల చేసిన డేటా ప్రకారం.. జీడీపీలో దాదాపు 60 శాతం ఉన్న తలసరి ప్రయివేట్ తుది వినియోగ వ్యయం 2011-12 నాటి ధరల ప్రకారం 6.6 శాతం పెరిగింది.
రెండోసారి సవరించిన అంచనాల ప్రకారం తలసరి తుది వినియోగ వ్యయం రూ. 75,723 గా ఉంది. ఇది ఫైనాన్షియల్ ఇయర్ 24 కోసం మొదటి సవరించిన అంచనాల ప్రకారం రూ. 71,016 గా ఉంది.
ఈ గణాంకాల ప్రకారం వినియోగదారుల చేతుల్లో నిత్యావసరాల వస్తువులు, లగ్జరీ వస్తువులు కొనుగోలు చేయడానికి, విహార యాత్రలు, బయట తినడం వంటి ఖర్చులతో సహ విచక్షణా ఖర్చులకు ఎక్కువ డబ్బు అందుబాటులో ఉంది. ఇది వినియోగ వ్యయాన్ని పెంచడానికి ఉపయోగపడే అంశాలు.
పరిశ్రమ డేటా మరోలా ఉందా?
కేర్ ఎడ్జ్ రేటింగ్స్ లోని ముఖ్య ఆర్థికవేత్త రజనీ సిన్హా మాట్లాడుతూ.. క్యూ3 లో జీడీపీ పుంజుకుంటుందనే ఊహాలు ఎక్కువగా ఉన్నాయి. ‘‘మెరుగైన జీఎస్టీ వసూళ్లు, ప్రజావ్యయం, విద్యుత్ ఉత్పత్తి, ఎగుమతి పనితీరుతో సహా అనేక స్థూల ఆర్థిక సూచికలు ఎక్కువగా ఊహజనితంగా ఉన్నాయి’’ అని అభిప్రాయపడ్డారు.
కానీ పెరుగుతున్న వినియోగ వ్యయం అందుకు విరుద్దంగా ఉందని ప్రభుత్వ డేటా చెబుతోంది. ముఖ్యంగా కార్లు, ద్విచక్ర వాహనాలను విక్రయించే సంస్థలు ఇటీవలు వెలువరించిన అభిప్రాయం కూడా భిన్నంగా ఉంది. వ్యవసాయ ఆదాయాలు పెరగడం వల్ల గ్రామీణ వ్యయం పెరుగుతున్నప్పటికీ పట్టణ ప్రాంతాల్లో వ్యయం మాత్రం సాధారణ స్థాయిలో ఉందని తెలిసింది.
మెరుగైన వ్యవసాయ కార్యకలాపాలు, తగ్గుతున్న ద్రవ్యల్భణం గ్రామీణ వినియోగ డిమాండ్ ఆజ్యం పోసినప్పటికీ పట్టణ డిమాండ్ మిశ్రమ చిత్రాన్ని అందిస్తున్నాయని సిన్హా ఈ గణాంకాలతో ఏకీభవించారు.
క్యూ4 కీలకం.. వృద్ది లక్ష్యం
ఎన్ఎస్ఓ ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంటే మార్చి 31 తో ముగిసే నాటికి జీడీపీ వృద్దిరేటు 6.5 శాతంగా ఉంటుందని గత నెలలో మొదటి మందస్తు అంచనాలలో ఇచ్చిన 6.4 శాతం కంటే ఎక్కువగా ఎక్కువగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్దిరేటు 6.5 శాతంగా అంచనా వేశారు.
కానీ ఆర్థిక వ్యవస్థ కొత్త లక్ష్యంతో అనుకున్న విధంగా వృద్ది చెందాలంటే ప్రస్తుత త్రైమాసికంలో జీడీపీ వృద్దిరేటు 7.6 శాతంగా ఉండాలి. ఇది సాధ్యమవుతుందా? ఇదే అందరిని వేధిస్తున్న ప్రశ్న.
ఈ త్రైమాసికంలో మహాకుంభమేళాకు వెళ్లిన కోట్లాది మంది భక్తుల వినియోగవ్యయం ఆర్థిక వృద్దిలో అంచనా పెరుగుదలకు దోహదపడుతుందని, ప్రభుత్వ మూలధనం డిమాండ్ మెరుగుపడే అవకాశం ఉందని ముఖ్య ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ అభిప్రాయపడుతున్నారు.
కేర్ ఎడ్జ్ రేటింగ్స్ కు చెందిన సిన్హా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. క్యూ4 లో మహకుంభ్ వేడుకలు వినియోగ డిమాండ్, వాణిజ్యం, హోటల్, రవాణా వంటి రంగాలకు అవసరానికి మించి మద్దతు ఇస్తుందని అన్నారు.
రాష్ట్ర మూలధన వ్యయం..
కానీ కొంతమంది ఆర్థికవేత్తలు రాష్ట్ర ప్రభుత్వాల మూలధన వ్యయం పెరుగుదల వలన ఆర్థిక సంవత్సరం రెండవ భాగంలో ఆర్థిక బూస్ట్ కు కారణమవుతుందని భావిస్తున్నారు.
వినియోగ రహస్యం గురించి ఈవై ఇండియా చీఫ్ పాలసీ అడ్వైజర్ డీకే శ్రీ వాస్తవ ‘ది ఫెడరల్ ’ తో మాట్లాడుతూ..డిసెంబర్ త్రైమాసికంలో పీఎఫ్ సీఈ వృద్ది గ్రామీణ ప్రాంతాల నుంచి మాత్రమే కాకుండా పట్టణ కొనుగోలుదారుల నుండి కూడా వచ్చిందని అన్నారు.
‘‘పట్టణ డిమాండ్ తగ్గడానికి దారి తీసిన కొన్ని ఉపాధి సమస్యలు ఉన్నాయి. కానీ పట్టణ డిమాండ్ లో లోటు అధికంగా ఉందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల ప్రకటించిన ఆదాయపు పన్ను రాయితీలు, వినియోగం బలంగా ఉండటం వలన రాబోయే త్రైమాసికాల్లో పీఎఫ్సీఈ పెరుగుదల కొనసాగుతుంది. కానీ దాని వల్ల జీడీపీ పెరుగుతుందా? అని అనుమానం వ్యక్తం చేశారు.
సీబీఆర్ఈ చైర్మన్, సీఈఓ అయిన అన్షుమాన్ మాట్లాడుతూ.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పునర్జీవనానికి ఆజ్యం పోస్తుందని అన్నారు. ‘‘ భారత్ బలోపేతం చేయబడిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, నియంత్రిత ద్రవ్యోల్భణం ఒత్తిళ్లు, వ్యూహాత్మక మూలధన వ్యయం ద్వారా తిరిగి గాడిలో పడుతుంది. స్థిరమైన దేశీయ డిమాండ్, సానుకూల పారిశ్రామిక ధోరణుల ద్వారా వృద్ది 6.5 శాతంగా ఉంటుందని అన్నారు. ప్రపంచ అనిశ్చితుల మధ్య భారత్ స్థిరమైన, డైనమిక్ ఆర్థిక వ్యవస్థగా స్థానాన్ని బలోపేతం చేస్తుందని అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ మూలధనం
రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువగా మూలధన నిధులతో ముందుకు వచ్చాయని అని శ్రీ వాస్తవ అన్నారు. ఎందుకంటే కేంద్రం, రాష్ట్రాల మూలధన వ్యయాన్ని ప్రొత్సహించడానికి ప్రయత్నిస్తోంది.
మౌలిక సదుపాయాల విస్తరణలో ప్రత్యేకంగా ఉపయోగించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద మొత్తంలో గ్రాంట్లు కేటాయించడం ద్వారా 1.5 లక్షల కోట్ల వరకూ వడ్డీ లేని రుణాలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు 50 సంవత్సరాల సమయం ఇవ్వడం ద్వారా జరుగుతుందని ఆయన అన్నారు.