బెంగళూరులో తయారైన డ్రైవర్ లెస్ కారు

కారులో ప్రయాణించిన ఉత్తరాది మఠాధిపతి

Update: 2025-10-29 06:02 GMT

‘మేడ్ ఇన్ ఇండియా’ డ్రైవర్ లెస్ కారు  బెంగుళూరులో తయారయింది.

ఇది పూర్తిగా భారతీయ సాంకేతిక పరిజ్ఞానంతో, దేశంలోని గుంతల గతుకుల రోడ్లను, రోడ్ల మీద తారస పడే పశువులను  దృష్టిలోపెట్టుకుని రూపొందించారు.

2019లో, ఐఐఎస్సి (IISP), విప్రోలు ఈ కారుతయారుచేసేందుకు చేతులు కలిపాయి. ఇపుడు ప్రోటోటైప్ డ్రైవర్‌లెస్ కారును బయటకు వచ్చింది. దీనిని అక్టోబర్ 27 ఆవిష్కరించినట్లు తెలిసింది.  ఈ విషయాన్ని ఆదర్శ హెగ్డే (Adarsh Hegde (@adarshahgd) X లో పోస్టు చేశారు.




విప్రో, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc),  RV కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లు సంయుక్తంగా ఈ కారును తయారు చేశాయి. ఈ డ్రైవర్‌లెస్ కారుని  WIRIN (విప్రో-IISc రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ నెట్‌వర్క్) బెంగళూరులో ఆవిష్కరించారు.
ఆర్ వి కాలేజ్ ఆవరణలో ఈ డ్రైవర్‌లెస్ కారులో ఉత్తరాది మఠానికి చెందిన శ్రీ శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ ప్రయాణించారు.  ఈ 28 సెకన్ల ప్రయాణం వీడియో వైరల్‌గా మారింది. స్వదేశీ స్వీయ-డ్రైవింగ్ టెక్నాలజీతో నడిచే ఈ కారు కళాశాల క్యాంపస్ అంతటా చక్కగా దూసుకుపోయింది. ఈ కారు తయారీ ప్రాజక్టుకు విప్రో ఆర్థిక సహాయం అందించింది.


Tags:    

Similar News