ఉత్తర్ ప్రదేశ్, అస్సాంలో ఫెడరల్ సర్వే హైలెట్స్..

ఫెడరల్-పుతియతలైమురై-యాప్ట్ 2024 ప్రీ-పోల్ సర్వే: ఉత్తర్ ప్రదేశ్, అస్సాంలో బీజేపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Update: 2024-02-23 14:31 GMT

రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన సర్వే ఆధారంగా ఉత్తర్ ప్రదేశ్, అస్సాంలో కమలం పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాతీయ స్థాయి ఒపీనియన్ పోల్ ప్రకారంగా.. అస్సాం ఓటర్లలో 40.20 శాతం మంది బిజెపికి మద్దతు తెలిపారు. 30.20 శాతం కాంగ్రెస్‌కు ఓటు వేస్తామని చెప్పారు.








ఒపీనియన్ పోల్ ఫలితాల ఆధారంగా బిజెపి, దాని మిత్రపక్షం ఏజీపీ (AGP) ఉమ్మడి ఓట్ల శాతం 41.72%. కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం 30.20%. బీజేపీ దాని మిత్రపక్షం కాంగ్రెస్ కంటే 11.52 శాతం పాయింట్లతో ముందంజలో ఉన్నాయి. 20.97 శాతం మంది చెప్పలేం / తెలియదని చెప్పారు.

ఉత్తర ప్రదేశ్‌లో..

ఉత్తరప్రదేశ్ ఓటర్లలో 54.33% మంది బిజెపికి ఓటు వేస్తామని చెప్పారు. 15.01 శాతం మంది ఓటర్లు సమాజ్ వాదీ పార్టీకి, 14.51% మంది ఓటర్లు కాంగ్రెస్‌కు ఓటు వేస్తామని చెప్పారు. 4.30% మంది ఓటర్లు BSPకి ఓటు వేస్తామని చెప్పారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో 49.98% మంది ఓటర్లు BJPకి, 1.21% మంది దాని కూటమి భాగస్వామి అప్నా దళ్‌కి ఓటు వేశారు.



 


 


2019 లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన పనితీరుతో పోలిస్తే బీజేపీ ఓట్ల శాతంలో 4.35 శాతం పెరిగింది. 2019లో 18.11% మంది ఓటర్లు సమాజ్‌వాదీ పార్టీకి ఓటు వేశారు. ఒపీనియన్ పోల్‌లో సమాజ్‌వాదీ పార్టీ ఓట్ షేర్ 2019లో వారి వాస్తవ పనితీరు కంటే స్వల్పంగా తక్కువ. 2019లో 6.36% మంది ఓటర్లు కాంగ్రెస్‌కు ఓటు వేశారు. ప్రస్తుత ఒపీనియన్ పోల్‌లో కాంగ్రెస్ ఓట్ షేర్ 14.51.UP ఓటర్లలో 20.19% మంది ప్రతిపక్ష నాయకుల నుంచి తమ ప్రధాన మంత్రి అభ్యర్థిగా అఖిలేష్ యాదవ్‌ను ఎంచుకున్నారు. బీఎస్పీ ఓటర్లను కాంగ్రెస్ తన వైపు ఆకర్షిస్తున్నట్లు తెలుస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 19.43% మంది ఓటర్లు BSPకి ఓటు వేశారు. 

Tags:    

Similar News