డలాస్‌లో రోడ్డుప్రమాదం.. హైదరాబాద్ వాసులు మృతి
నలుగురు తెలుగు వారు సజీవదహనం.;
By : The Federal
Update: 2025-07-07 16:51 GMT
అమెరికా డలాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన నలుగురు మరణించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కూడా సజీవదహనం అయ్యారు. సెలవుల దృష్ట్యా అట్లాంటలోని బంధువుల ఇంటికి కారులో వెంకట్ కుటుంబంతో కలిసి వెళ్లాడు. అట్లాంటా నుంచి డాలస్‌కు తిరిగి వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రీన్‌కౌంటీ వద్ద రాంగ్‌రూట్‌లో వచ్చి కారును మినీ ట్రక్కు ఢీకొట్టింది. ట్రక్కు ఢీకొట్టడంతో మంటలు చెలరేగి కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.