తిరిగి మైదానంలోకి రావడం.. మాటల్లో చెప్పలేను
తిరిగి మైదానంలోకి అడుగు పెట్టేందుకు ఎదురు చూస్తున్నా అని యువ క్రికెటర్ రిషబ్ పంత్ అన్నారు. ఈ ఐపీఎల్ ఢిల్లీ జెర్సీలో పంత్ చూడాలను అనుకుంటున్నాని యాజమాన్యం సైతం..
By : The Federal
Update: 2024-03-13 10:02 GMT
ప్రమాదం జరిగిన తరువాత కోలుకుని తిరిగి మైదానం రాబోతుంటే అరంగ్రేట మ్యాచ్ ఆడుతున్న సంతోషంగా ఉందని భారత క్రికెటర్ రిషబ్ పంత్ అన్నారు. ఢిల్లీ క్యాపిటల్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పంత్ ఈ విధంగా స్పందించాడు. ఐపీఎల్ ఆడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అదే సమయంలో సంతోషం, ఉద్వేగం కలగలిసి ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. పంత్ ఇప్పటికే ఐపీఎల్ కోసం ఫిట్ అయ్యాడని బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. పంత్ 2022 డిసెంబర్ లో కారు ప్రమాదంలో గాయపడ్డాడు. తిరిగి కోలుకవడానికి దాదాపు 14 నెలలకు పైగా సమయం పట్టింది.
"నేను అనుభవించిన ఈ బాధ తర్వాత మళ్లీ క్రికెట్ ఆడటం అనేది అద్భుతం కంటే తక్కువ కాదు," అని పంత్ ఉద్వేగభరితంగా చెప్పాడు. “నా శ్రేయోభిలాషులు, అభిమానులందరికీ అన్నింటి కంటే ముఖ్యంగా, BCCI మరియు NCA సిబ్బందికి నేను రుణపడి ఉంటాను. వారి ప్రేమ మద్దతు నాకు అపారమైన శక్తిని ఇస్తూనే ఉంది. పంత్ బుధవారం ఢిల్లీ క్యాపిటల్ ప్రీ సీజన్ క్యాంప్ లో చేరాడు. నేను జట్టుతో తిరిగి కలిసినందుకు సంతోషిస్తున్నాను. మా జట్టు యాజమాన్యం, వ్యక్తిగత సహాయ బృందం నాకు అడుగడుగన సాయం అందిస్తున్నారు. నేను అభిమానుల ముందు తిరిగి క్రికెట్ ఆడేందుకు సంతోషిస్తున్నాను.
ఈ సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్ చైర్మన్ & సహ యజమాని పార్థ్ జిందాల్ మాట్లాడుతూ, “ఢిల్లీ క్యాపిటల్స్ కుటుంబానికి తిరిగి వచ్చిన రిషబ్‌ను సాధారణంగా ఆహ్వనిస్తున్నాం. అందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాము. సవాళ్లను అధిగమించడంలో అతను ప్రదర్శించిన పట్టుదల గురించి చెప్పాలంటే స్ఫూర్తిదాయకం.
జట్టు సహ యజమాని కిరణ్ గ్రాంధి మాట్లాడుతూ, “రిషబ్ పునరాగమనం ఢిల్లీ క్యాపిటల్స్‌లో మనందరికీ మాత్రమే కాదు, భారత క్రికెట్‌కు అద్భుతమైన వార్త. అవసరమైనప్పుడు అతనికి సహాయం, మద్దతు ఇచ్చినందుకు మేము సంతోషిస్తున్నాము. అతనిని తిరిగి DC జెర్సిలో చూడడానికి మేము చాలా సంతోషిస్తున్నాము”
కాాగా ఢిల్లీ క్యాపిటల్ తన తొలి మ్యాచ్ ను మార్చి 23 న పంజాబ్ తో మొహాలి వేదికగా తలపడనుంది.