‘‘ హెచ్ వన్ బీ వీసాదారులు- స్వదేశానికి తిరిగి రండి’’

జోహో కార్పోరేషన్ సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు పిలుపు

Update: 2025-09-22 07:43 GMT
శ్రీధర్ వెంబు

హెచ్ వన్ బీ రుసుమును డొనాల్డ్ ట్రంప్ అమాంతం పెంచడంతో భారత ఐటీ, టెక్నాలజీ రంగాల నిపుణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై భారత టెక్ దిగ్గజం శ్రీధర్ వెంబు మాట్లాడారు. ట్రంప్ చర్య వల్ల నష్టపోయే వారికి ఆయన కొత్త సూచనలు ఇచ్చారు.

జోహో కార్పొరేషన్ బిలియనీర్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ సైంటిస్ట్ అయిన ఆయన, ఆదివారం ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు. హెచ్ వన్ బీ వీసా హోల్డర్లు భారత్ కు తిరిగి వచ్చి ఇక్కడే తమ జీవితాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
1947 విభజన నాటి పరిస్థితితో చాలా సింధీ కుటుంబాటు పాక్ లోని సింధు రాష్ట్రం నుంచి దేశానికి వచ్చి విజయం సాధించారు. అమెరికన్ వీసా హోల్డర్లు భారత్ లో తమ జీవితాలను పునర్నిర్మించుకోవడానికి ఐదు సంవత్సరాలు పట్టవచ్చు. కానీ దీర్ఘకాలంలో ఇవి లాభిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికాలో భయంతో నిండిన జీవితాన్ని గడపవద్దని ఆయన వారిని కోరారు.
‘‘విభజన సమయంలో వారి కుటుంబాలు అన్నింటిని విడిచిపెట్టి భారత్ కు ఎలా వచ్చామో నా సింధీ స్నేహితుల నుంచి అనేక కథలు విన్నాము. వారి ఇక్కడ వారి జీవితాలను పునర్మించుకున్నారు. సింధీలు భారత్ బాగా జీవిస్తున్నారు’’ అని ఆయన అన్నారు.
‘‘ఇలాంటి విషయం చెప్పడానికి నాకు బాధగా ఉంది. కానీ అమెరికాలో హెచ్ వన్ బీ వీసాపై ఉన్న భారతీయులకు ఇదే మంచి సమయం కావచ్చు. ఇంటికి తిరిగి రండి. మీ జీవితాలను పునర్మించుకోవడానికి 5 సంవత్సరాలు దాక పట్టవచ్చు. కానీ అది మనల్నీ బలోపేతం చేస్తుంది. భయంతో జీవించకండి. ధైర్యంగా ముందుకు సాగండి. మీరు బాగా పని చేస్తారు’’ అని ఆయన ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.
హెచ్ వన్ బీ ఫీజులు..
అమెరికాలోని వేలమంది భారతీయ టెక్ ఉద్యోగులను ఆందోళనకు గురిచేసిన అంశం ఏదయిన ఉందంటే అది ట్రంప్ భారీగా పెంచిన హెచ్ వన్ బీ వీసా రుసుమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
చాలామంది భారతీయులు శరన్నవరాత్రుల సందర్భంగా భారత్ కు రావాలని ప్రణాళికలు వేసుకున్నారు. కానీ వీసా రుసుం భారీగా పెంచడంతో వెంటనే తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు.
వివాహం వంటి వ్యక్తిగత వేడుకలను కూడా రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ట్రంప్ హెచ్ వన్ బీ రుసుమును 995 డాలర్ల నుంచి ఏకంగా లక్ష డాలర్లకు పెంచేశారు. ఇది కొత్త వీసాదారులకు మాత్రమే అని అధికారులు స్పష్టం చేశారు.
అమెరికా టెక్ దిగ్గజాలు వెంటనే తమ ఉద్యోగులను ఉన్నఫలంగా అమెరికా వచ్చేయని ఆదేశాలు జారీ చేశాయి. కొత్తగా భారత్ కు చేరుకున్న వారు విమాన ప్రయాణాల కోసం బుకింగ్ చేసుకుంటున్నారు.
జోహోను ప్రపంచ సాప్ట్వేర్ పవర్ హౌజ్ గా మార్చడానికి ముందు వెంబు స్వయంగా అమెరికాలో పని చేశాడు. ఆయన ప్రతి సంక్షోభాన్నిభారతీయ ప్రతిభకు ఒక మలుపుగా, అవకాశంగా భావిస్తున్నారు.
గతంతో పోలిస్తే నేటీ భారత్ అనేక అవకాశాలను అందిస్తుందని దానిని పెద్దగా చేయాలనుకునే వారు చివరకు ప్రయోజనం పొందుతాడని అతను చెబుతున్నారు. వెంబు ఆలోచనకు అనేకమంది ప్రశంసలు కురిపిస్తున్నారు.
అయితే కొంతమంది నెటిజన్లు ఆయన విమర్శిస్తున్నారు. ‘‘ శ్రీధర్ మీ ప్రచారాన్ని ఆపండి. మీ బాకాను ఇలా ప్రతిచోట ఊదడం సరికాదు. దయచేసి దీనిని దేశ విభజనతో పోల్చకండి.
లక్షలాది మంది ప్రజలు చనిపోయారు. కుటుంబాలు విడిపోయాయి. గాయం ఇప్పటికి కొనసాగుతోంది. సింధీలు, పంజాబీలు, బెంగాలీలు అవిభక్త భారతంలో ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికి మచ్చలు ఉన్నాయి. గాయాలను చిన్న చూపు చూడకూడదు’’ అని ఒకతను కామెంట్ చేశారు.
‘‘హలో.. దయచేసి ఈ అర్థం లేని పనిని ఆపండి. వారందరూ భారత్ కు తిరిగి వస్తే మీరు ఏం చేస్తారు. యూఎస్ఏలో మంచి జీవితాన్ని గడుపుతున్న భారతీయ టెక్నీషియన్స్ ఈ పేద దేశంలో మంచి జీవితాన్ని పొందుతారా? మంచి జీవితాన్ని గడపడానికి సంవత్సరాలు, తరతరాలుగా ఎందుకు కష్టపడాలి’’ అని మరో వినియోగదారుడు ఎక్స్ లో పోస్ట్ చేశారు.



Tags:    

Similar News