అతను పక్కా టీ20 ఆటగాడు.. తన ఎంపికకు న్యాయం చేస్తాడు: ప్లెమింగ్

వరల్డ్ కప్ లో చోటు దక్కించుకున్న సీఎస్కే ఆటగాడు శివమ్ దూబే పక్కా టీ20 ఆటగాడని, తన ఎంపికకు న్యాయం చేస్తాడని సీఎస్కే జట్టు ప్రధాన కోచ్ స్టీఫెన్ ప్లెమింగ్..

Update: 2024-05-01 07:36 GMT

టీమిండియా లో చోటు దక్కించుకున్న ముంబై ఆటగాడు శివమ్ దూబే పరిపూర్ణ ఆటగాడని సీఎస్కే జట్టు ప్రధాన కోచ్ స్టీఫెన్ ప్లెమింగ్ వ్యాఖ్యానించారు. రాబోయే ప్రపంచ కప్ లో ఈ ఎడమ చేతి వాటం ఆల్ రౌండర్ కచ్చితంగా ప్రభావం చూపుతాడని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రస్తుత ఐపిఎల్‌లో సీఎస్కేలో తరఫున అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో రెండో స్థానంలో ఉన్న దూబే.. తన ప్రతిభ కారణంగా టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌కు ముందు ఫ్లెమింగ్ మాట్లాడుతూ, అతను తన గేమ్ ను రోజు రోజుకు ముందుకు తీసుకెళ్తున్నాడని కొనియాడారు.

ఇది అనుభవం ద్వారా మాత్రమే సాధ్యమైందని కివిస్ మాజీ స్కిప్పర్ అభిప్రాయపడ్డారు. ఇంతకు ముందు అతని ఆటలో లోపాలను సరిదిద్దుతూనే.. తనకు ఉన్న బలాన్ని ఇంకా పెంచే ప్రయత్నం చేశాం. ఇదే అతని ఆటలో మార్పుకు కారణం అని ప్లెమింగ్ వివరించాడు.

దూబే ఫామ్ ఇలాగే కొనసాగితే, అతను ప్రపంచ కప్‌లో టీమిండియాకు ప్రభావవంతమైన ఆటగాడిగా మారడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ ఐపీఎల్ లో దూబే మూడు అర్ధ సెంచరీలతో సహా 172.41 స్ట్రైక్ రేట్‌తో తొమ్మిది మ్యాచ్ లలోలో 350 పరుగులు చేశాడు. స్పిన్ ఆడటంలో తన ప్రతిభ రోజు రోజుకి మెరుగుపరుచుకుంటున్నాడని దూబే ను ప్లెమింగ్ ప్రశంసించారు.

CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఒక సెంచరీ మూడు అర్ధసెంచరీలతో 447 పరుగులు చేసి తన జట్టు తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఉన్నాడు. ఈ తరువాతి స్థానంలో దూబే ఉన్నాడు.

అయితే ఇంపాక్ట్ ప్లేయర్ విధానం వల్లే దూబే ఇలా చెలరేగుతున్నాడని, కేవలం బ్యాటింగ్ మాత్రమే చేసి సత్తా చాటుతున్నాడని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్న మాట. ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కాకుండా దేశవాళీలో జరిగే టీ20 టోర్నమెంట్ లో ప్రతిభా చాటిన కుర్రాళ్లను తీసుకోవాలని సూచిస్తున్నారు. 2019 వరల్డ్ కప్ లో అంబటి రాయుడిని కాదని, ఆల్ రౌండర్ అంటూ విజయ్ శంకర్ ను ఎంపిక చేసారు. తీరా బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలో సత్తా చాటలేక జట్టుకు భారంగా మారాడని క్రీడా పండితులు చెబుతున్న మాట.

Tags:    

Similar News