పార్లమెంటు తలులపు వద్ద సీఐఎస్‌ఎఫ్ బలగాల మోహరింపు, ఎందుకంటే..
డిసెంబర్ 13న జరిగిన ఘటన దృష్ట్యా పార్లమెంట్ గేట్ల వద్ద భద్రత కట్టుదిట్టం చేయనుంది. జనవరి 31 నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల దృష్ట్యా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు.
జనవరి 31 నుంచి పార్లమెంట్‌లో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు కేంద్రం చర్యలు తీసుకుంది. అందులో భాగంగా పార్లమెంట్ ప్రవేశ ద్వారాల వద్ద భద్రత సిబ్బందిని పెంచింది. సీఐఎస్‌ఎఫ్ బలగాలను ఉంచనుంది. 140 మంది సిఐఎస్‌ఎఫ్ సిబ్బందిని పార్లమెంట్ కాంప్లెక్స్ వద్ద విధుల నిర్వహిస్తారు.
గత ఏడాది డిసెంబర్ 13వ తేదీన జరిగిన ఘటన దృష్ట్యా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు హాలులోకి ప్రవేశించి పొగ డబ్బాలను స్ప్రే చేయడంతో ఎంపీలు భయాందోళనకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. ఇక నుంచి కొత్త, పాత పార్లమెంట్ భవనాలతో పాటు వాటికి అనుసంధానంగా ఉన్న బిల్డింగుల వద్ద సీఐఎస్‌ఎఫ్ బలగాలతో సీఆర్‌పీఎఫ్‌కు చెందిన బలగాలు, ఢల్లీి పోలీసులు భద్రతా చర్యలను పర్యవేక్షించనున్నారు.