గుండెల్లో జాతీయ జెండా చాలా ఎత్తుగా ఉంది - ఏచూరి

ఏచూరికి నచ్చిన సినమా పాట ఏమిటో తెలుసా?

Update: 2024-09-15 07:24 GMT


రాజ్యాంగాన్ని సమర్పించడానికి ముందు 1949 లో రాజ్యాంగ నిర్ణాయక సభలో బి ఆర్ అంబేడ్కర్ ఒక గొప్ప ప్రసంగాన్ని ఇచ్చారు. ప్రతి పౌరుడు, వ్యక్తి చదవవలసిన ప్రసంగం ఇది. దానికి సారాంశం ఏమిటే: దేశ భక్తి ముఖ్యం, కేవలం దేవుళ్ళ భక్తి కాదు అన్నారు. ఏచూరి సీతారం అదే సందేశాన్నిమరింత గట్టిగా వివరిస్తూ వచ్చారు. అంబేడ్కర్ రాజ్యాంగ ప్రసంగంతో పాటు ఏచూరి ప్రసంగాన్ని కూడా చదువుకోవాల్సిందే.

ఏచూరి2016 ఆగస్టు 11 న ఒక కీలకమైన ప్రసంగం చేసారు. అరగంట సేపు ఆయన చెప్పిన అంశాలు అందరూ చదవ వలసినవి, వినవవలసినవి. ఆ ప్రసంగం ఇప్పుడు వినే యూట్యూబ్ లో అవకాశం లభించించింది. ప్రతిపక్ష అధికార పక్షానికి మరీ ముఖ్యంగా, మొత్తం ఈ ప్రసంగం ఈ దేశానికి ఎంతో అవసరమైంది. అరగంట సేపు సాగిన ప్రసంగం యుట్యూబ్ లో చూడవచ్చు.

జేఎన్‌యూ వివాదం, దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యపై పార్లమెంట్‌లో చర్చ జరిగింది. రైల్వే మంత్రి సురేశ్ ప్రభు రైల్వే బడ్జెట్ 2016ను సమర్పించిన రోజున, సభ పదే పదే వాయిదా పడింది. ట్రెజరీ ప్రతిపక్ష బెంచ్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చాలా ఘాటుగా చర్చ అర్ధరాత్రి దాకా సాగింది. మళ్ళీ ఉదయం మొదలయింది. భిన్నాభిప్రాయాలను అణిచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని దేశంపై "దైవపరిపాలన, ఫాసిస్ట్ హిందూ రాష్ట్రం" అనే ఆలోచనను రుద్దడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది ద్వేషపూరిత ప్రసంగం వాక్ స్వాతంత్ర్యం కాదని ఏచూరి చాలా గొప్పగా విమర్శించారు.

అంతటి భారత దేశానికి బాధ్యతాయుతమైన పార్లమెంటేరియన్ అయిన ఏచూరి సీతారాం లేకుండాపోయారు. 71 సంవత్సరాలకే, అద్భుతమైన ప్రతిపక్షనాయకుడు, తప్పులు చేసే ప్రభుత్వాన్ని హెచ్చరించే ధమ్మున్న పెద్దమనిషి లేకుండా పోయాడు. ఇది చాలా దురదృష్టం.

దళిత రోహిత్ వేముల ఆత్మహత్యపై నాటి మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతితో మాటల వాగ్వివాదానికి దిగారు. లోక్‌సభలో రాజకీయ పార్టీల సభ్యుల మధ్య చర్చనీయాంశమైంది. ఆ రాత్రి మహిషాసురుడిపై స్మృతి ఇరానీ ఒక కరపత్రాన్ని ఉటంకించినపుడు, గొడవలు పెరిగి రాజ్యసభ మరో రోజుకు వాయిదా పడింది. లోక్‌సభలో ఇరానీ 'మహిషాసుర బలిదాన దినం' గురించి మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు భారతదేశంలో రిజర్వేషన్ అమలు చేయడానికి ఢిల్లీ విశ్వవిద్యాలయంతో పాటు స్మృతి ఇరానీ నిరాకరించారని ఏచూరి చెప్పారు. స్మృతి ఇరానీ రోహిత్ వేముల FB పోస్ట్‌ను మళ్లీ చదివారు. అప్పుడు నేను రోహిత్ వేముల తల్లితో మాట్లాడిన విషయాన్ని తరువాత వెల్లడించలేదని రాజ్యసభలో స్మృతి ఇరానీ ప్రకటించిచారు ‘‘నా విద్యార్హతలపై నన్ను "అన్‌పడ్ మంత్రి" అని పిలిచేవారు చాలా మంది ఉన్నారు’’ అని రాజ్యసభలో స్మృతి ఇరానీ అన్నారు.

పశ్చిమబెంగాల్ ఎన్నికలు సమీపిస్తున్నందున, దేశ వ్యతిరేక నినాదాలు లేవనెత్తుతున్న క్యాంపస్‌లోకి పోలీహఃసులు ప్రవేశించరని దీని అర్థం కాదని ఆనాటి మంత్రి జైట్లీ అన్నారు.

జవహర్ లాల్ విశ్వవిద్యాలయం పోలీసులు ప్రవేశించలేని సార్వభౌమ భూభాగం కాదు. భారతీయ శిక్షాస్మృతిని ఉల్లంఘిస్తే, పోలీసులకు ప్రవేశించే హక్కు ఉందని జైట్లీ విమర్శించారు.

ఈ సందర్భంలో ఏచూరి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు. ఆరోజు చర్చ ఈ విధంగా జరిగింది ‘‘నేను హిందూ కుటుంబంలో పుట్టాను. వేదాలన్నీ నేర్చుకున్నాను. వాటన్నింటిని అధ్యయనం చేయడం వల్ల నేను కమ్యూనిజంలో చేరాను: 'మనువాదం'కు వ్యతిరేకంగా నినాదాలు అలాగే ఉంటాయి. నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే అరెస్ట్ చేయండి,’’ అన్నారాయన.

మాకు దేశ భక్తి నేర్పాల్సిన అవసరం లేదు

‘‘మా గుండెల్లో జాతీయ జెండా 207 అడుగుల కంటే చాలా ఎత్తులో ఉంది, మేము జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం సంస్కృతి నుంచి వచ్చాం. గౌరవనీయులైన హోంమంత్రిని కలిశాను, ఎవరైనా దేశ వ్యతిరేక నినాదాలు చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పాం. నిర్దోషిని శిక్షించబోమని హామీ ఇచ్చారు.

ఈరోజు మీరు యూనివర్సిటీ మొత్తాన్ని 'యాంటీ-నేషనల్'గా అభివర్ణిస్తున్నారు.

మీరు మాకు దేశ భక్తి నేర్పాల్సిన అవసరం లేదు. మీ నుండి మాకు దేశభక్తి సర్టిఫికేట్లు అవసరం లేదు.’’ అని ఏచూరి అన్నారు.

మొత్తం అరగంట ఏచూరి ఆలోచన రేకెత్తించే ప్రసంగం చేసారు. హైదరాబాద్ యూనివర్సిటీలో జరిగిన వివాదంపై ‘‘మాకు జెండా గురించి తెలుసు. అభిమానం తెలుసు. మీరు చెప్పవలసిన అవసరం లేదు. హైదరాబాద్ కేంద్ర యూనివర్సిటీ, జెఎన్ యు వంటి అనేకానేక దేశంలోని విశ్వవిద్యాలయాలలో ఏ జరుగుతుందోచూడండి. పార్లమెంట్ ద్వారా చేసిన చట్టాల గతి ఇది. మనం వాటిని రక్షించుకోవాలి సమయం వచ్చింది,’’ అని గుర్తు చేసారు.

ఇ ఎమ్ ఎస్ నంబూద్రిపాద్ స్మారక సెమినార్ 2021 నాడు ప్రారంభిస్తూ సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం మరో కీలకమైన ప్రసంగం చేశారు. ఏచూరి ఈ విధంగా వివరించారు.

‘‘కేరళలో మానవాభివృద్ధి సూచికలు సంపన్న పెట్టుబడిదారీ దేశాల స్థాయిని అందుకుంటున్నాయి. దేశీయంగానూ అంతర్జాతీయంగానూ సాగుతున్న నయా ఉదారవాద పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థలో కొనసాగుతూనే కేరళ ఈ విజయాలు సాధించింది.

భారతదేశంలో కేంద్రం అమలు చేసిన భూసంస్కరణలు సాంప్రదాయ భూస్వామ్య వ్యవస్థ స్థానంలో పెట్టుబడిదారీ భూస్వాములను తయారు చేస్తే కేరళ, బెంగాల్, నాటి కాశ్మీర్ లల్లో అమలు జరిగిన భూసంస్కరణలు దున్నేవాడికే భూమి మీద హక్కును దఖలు పర్చాయి.

భారతదేశంలో పాలకవర్గం భూస్వామ్య వ్యవస్థ తో రాజీ పడింది. నయాఉదారవాదం సారాంశం ఒక్కటే, ప్రజలను పీల్చి పిప్పి చేసైనా సరే లాభాలు గ్యారంటీ చేయాలని. ఈ సూత్రమే నేడు ప్రజలకు వాక్సిన్ అందించే విషయంలో కూడా కనిపిస్తుంది. ఒకప్పుడు ప్రపంచీకరణ విధానాలు కోసం డప్పు కొట్టిన వారే నేడు ఈ సంక్షోభం నుండి బయట పడటానికి ప్రభుత్వ పాత్ర పెరగాలని ప్రతిపాదిస్తున్నారని మరువ రాదు.

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తాను మార్క్సిస్టును కాదనీ అయినా నేడున్న సందర్బంలో ప్రభుత్వం ముందుకు వచ్చి బాధ్యత తీసుకోకపోతే ఈ వ్యవస్థ మనుగడ సాగించలేదని ప్రకటించాడు.

ఈ నేపధ్యంలో భారత పాలకవర్గాల పాత్రను పరిశీలించాలి. గత ఏడేళ్లలో నగ్నంగా ప్రపంచీకరణ విధానాలు అమలు చేస్తోంది. గత మూడు దశాబ్దాలుగా సాగిస్తున్న ప్రయాణాన్ని ఆ ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది. ఆశ్రిత పెట్టుబడిదారుల లాభాలు కాపాడేందుకు లక్షల కోట్ల ప్రజా ధనాన్ని అనేక పేర్లమాటున దారి మళ్లిస్తున్నారు. దేశాన్ని మతోన్మాద హిందూ దేశంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

నేడు మనం చూస్తోంది మతోన్మాదం కార్పొరేట్ సంకీర్ణం. ఈ దిశగా దేశాన్ని నడిపించాలంటే ప్రజలు హేతుబద్దంగా ఆలోచించకూడదు. రాష్ట్ర ప్రభుత్వాల హక్కులు కాలరాయాలి.నేడు దేశంలో

రాజ్యాంగ వ్యవస్థల స్వయప్రతిపత్తి ధ్వంసం జరుగుతుంది. లక్షద్వీప్ లో ఏమి జరుగుతుందో చూడండి. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేసినందుకు దేశ ద్రోహం కేసులు బనాయిస్తున్నారు.

దేశంలో మూడు ప్రధాన వైరుధ్యాలు ముందుకొస్తున్నాయి. 1. వ్యవసాయ చట్టాలు మొత్తం ప్రజానీకానికి పాలకవర్గానికి మధ్య పెరుగుతున్న వైరుధ్యాన్ని ముందుకు తెస్తున్నాయి. 2. గుత్తపెట్టుబడి దారులు చిన్న మధ్యతరగతి పారిశ్రామిక వర్గానికి మధ్య ఉన్న వైరుధ్యం, 3. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రానికి మధ్య తలెత్తుతున్న సంక్షోభం మూడో వైరుధ్యం. ఈ సమయం లో కేరళ నమూనాను. మరింత బలోపేతం చెయ్యాలి. ప్రభుత్వ నిర్ణయాల్లో ప్రజల. భాగస్వామ్యం పెంచాలి’’ అని ఏచూరి వివరించారు.

పార్లమెంటేరియన్ గా ఏచూరి

ఏచూరి సీతారం 2013 నుంచి 2010 వరకు 87శాతం కన్నా ఎక్కువ సేపు పార్లమెంట్ లో ఉండి చర్చల్లో పాల్కొన్నారు. దేశానికి పనికి వచ్చే వందలాది ప్రశ్నలు లేవనెత్తారు. మొత్తంగా 244 చర్చలలో పాల్గొన్నారు.

ఏచూరికి నచ్చిన సినిమా పాట

ఈ సందర్భంలో ఏచూరి గారికి ఎంతో నచ్చిన పాట ‘‘దిల్ కా భన్వర్ కరే పుకార్’’ మహమ్మద్ రఫీ గానం చేసి, దేవానంద్ నటించిన సినిమా చిత్రం. తేరే ఘర్ కే సామ్నే (Tere Ghar Ke Samne:1963), ఎస్ డి బర్మన్ స్వరం, హస్రత్ జైపురీ రచయిత. దేవానంద్ తో పాటు నూతన్ తదితరులు నటించారు.

డిల్లీ కుతుబ్ మినార్ చూడడానికి ఆనాటి రోజుల్లో వీలుండేది. మొత్తం కుతుబ్ మినార్ ఎక్కి, కిందికి దిగవచ్చు కూడా. దర్శకుడు ఈ చిత్రాన్ని చాలా బాగా నిర్మించారు. ముందుగా కుతుబ్ మినార్ తో ఒక సారి చూపి, ఆ తరువాత పై నుంచి ఒక్కో మెట్టు దిగితూ వచ్చే దృశ్యాన్ని హృద్యంగా చిత్రీకరించారు. ‘‘దిల్కా బన్వర్ కరే పుకార్, ప్యార్ కా రాగ సునో ప్యార్ కా రాగ్ సునో రే, ఫూల్ తుమ్ గులాబ్ కా, క్యాషబాబ్ ఆప్ కా, జో అదా హై వోఁ బహార్ హై, దిల్ కా భన్వర్ కరే పూకార ప్యాగ్ కా రాగ్ సునో’’. పిల్లలు చూడడానికి ఎక్కినపుడు త్రొక్కిడి కారణాల వల్ల చాలా మంది చనిపోయిన తరువాత కుతుబ్ మినార్ చూడడానికి నిషేధించారు.


Tags:    

Similar News