గేమ్ ను లోతుగా అర్ధం చేసుకుంటాను: పంజాబ్ బ్యాటింగ్ సంచలనం మాట..

కోల్ కత బౌలింగ్ యూనిట్ లోని అందరి బంతులను బౌండరీ లైన్ దాటించిన బ్యాటింగ్ సంచలనం.. నరైన్ బౌలింగ్ ను మాత్రం విడిచిపెట్టాడు. దానికి అతను చెప్పిన కారణం ఏంటో తెలుసా?

Update: 2024-04-27 11:29 GMT

లోతుగా గేమ్ ను అర్థం చేసుకోవడం, పరుగులు  సాధించడానికి అనుకూలంగా ఉన్న బౌలర్లను లక్ష్యంగా ఎంచుకుని దాడి చేయడం తన విజయ రహస్యమని పంజాబ్ కింగ్స్ బ్యాట్స్ మెన్ శశాంక్ సింగ్ అన్నారు. శుక్రవారం నాడు కోల్ కత నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో శశాంక్ మైదానంలో విధ్వంసం సృష్టించాడు. కేవలం 28 బంతులను ఎదుర్కొని 68 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో పంజాబ్ గెలవడం ద్వారా టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులను విజయవంతంగా చేజింగ్ చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది.

శశాంక్ మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు, PBKS 7.3 ఓవర్లలో 84 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో అప్పటికే సెంచరీ హీరో జానీ బెయిర్‌స్టో 39 బంతుల్లో 93 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. శశాంక్ రాగానే బాదడం మొదలు పెట్టాడు. ఈ కుర్రాడి బ్యాటింగ్ ఏ రేంజ్ లో సాగిందంటే.. విధ్వంస ఆటగాడిగా పేరున్న బెయిర్ స్టో 9 బంతులను ఎదుర్కొని 15 సాధించాడు. ఇదే సమయంలో శశాంక్ సింగ్ 68 పరుగులు సాధించాడు. అందులో (2x4, 8x6)ఉన్నాయి.
"ఐపీఎల్‌లో నేను 5-7తో బ్యాటింగ్ చేస్తానని నాకు తెలుసు, కాబట్టి నా ఇన్నింగ్స్‌ను ఎలా లోతుగా తీసుకెళ్లాలనే దానిపై నేను ప్లాన్ చేస్తున్నాను" అని మ్యాచ్ అనంతరం శశాంక్ అన్నారు. అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో కేకేఆర్ లోని ఇతర బౌలర్ల ను టార్గెట్ చేసిన శశాంక్, మిస్టరీ స్పిన్నర్ నరైన్ ను మాత్రం విడిచిపెట్టాడు. దీనిపై ఈ యువ బ్యాట్స్ మెన్ సమాధానమిస్తూ.. “సునీల్ నరైన్ ప్రపంచ స్థాయి బౌలర్ అని నాకు తెలుసు, కాబట్టి అతనిపై ఎక్కువ దాడి చేయడంలో అర్థం లేదని అనుకున్నాను. అతని బౌలింగ్ లో సింగిల్స్, డబుల్స్ కొట్టడం. ఏదైన బంతి ఎడ్జ్ కు తగిలితే బంతిని బౌండరీ వెళ్తుందని అనుకున్నాని వివరించాడు.
"పరుగుల కోసం ఇతర బౌలర్లు ఉన్నారు, కాబట్టి దానిని నరైన్ ను లక్ష్యం చేసుకోవం ఉత్తమం కాదు. నేను ఎంచుకున్న బౌలర్ల నుంచి పరుగులు రాబట్టుకున్నాను. అదే నా లక్ష్యం" అని అతను చెప్పాడు.
వాస్తవానికి, శశాంక్ ఎదుర్కొన మొత్తం 28 బంతుల్లో నరైన్ నుంచి ఏడు బంతులను ఎదుర్కొని మూడు పరుగులు మాత్రమే సాధించాడు. ఇతర బౌలర్ల నుంచి 21 బంతుల్లో మిగిలిన 65 పరుగులు సాధించాడు. నా 32 ఏళ్ల సొంత అనుభవం, పిబికెఎస్‌లో తన తండ్రి, కోచ్‌లతో చేసిన చర్చలు ఈ ప్రయాణంలో తనకు సహాయపడ్డాయని చెప్పాడు.
“మేము స్మార్ట్‌నెస్ గురించి మాట్లాడుకుంటే, అది అనుభవంతో వస్తోందని చెప్పవచ్చు. రెండవది, నేను మా నాన్నతో క్రికెట్ గురించి చాలా సమయం గడుపుతాను. ఒక వేళ నేను త్వరగా ఔట్ అయితే.. ఇది స్లో వికెట్ కావునా.. కొంచెం నెమ్మదిగా ఆడాలని చెప్తారు. ఇంట్లో ఉన్న మా నాన్నతో ఇక్కడ ఉన్న ప్రపంచ స్థాయి కోచ్‌లతో నేను ఈ సంభాషణలను కొనసాగిస్తున్నాను. నేను ప్రశ్నలు అడగడం, వారు ఏమి చేస్తున్నారో అర్థం చేసుకోవడం ఇదే నా పని. అది నా క్రికెట్‌ను మెరుగుపరుస్తుంది, ”అన్నారాయన.
Tags:    

Similar News