మ్యాగీ ఇండియాలో సూపర్ హిట్...

నెస్టీ ఉత్పత్తి చేసే మ్యాగీ ఇన్‌స్టంట్ నూడిల్స్‌కు ఇండియాలో డిమాండ్ పెరిగింది. కిట్‌క్యాట్‌కు రెండో అతిపెద్ద మార్కెట్‌గా భారత్ అవతరించింది.

Update: 2024-06-18 12:47 GMT

నెస్టీ ఉత్పత్తి చేసే మ్యాగీ ఇన్‌స్టంట్ నూడిల్స్‌కు ఇండియాలో డిమాండ్ పెరిగింది. చాక్లెట్ వేఫర్ కిట్‌క్యాట్‌కు రెండో అతిపెద్ద మార్కెట్‌గా భారత్ అవతరించిందని సంస్థ పేర్కొంది.

మ్యాగీ బ్రాండ్‌తో ఇన్‌స్టంట్ నూడుల్స్‌ను విక్రయించే నెస్లే.. ఫైనాన్సియల్ ఇయర్ 24లో 6 బిలియన్ల మ్యాగీలను విక్రయించింది. 42వేల మిలియన్ల కిట్‌క్యాట్‌ను విక్రయించినట్లు తెలిపింది.

నెస్లే బ్రాండ్‌తో ఓట్స్ నూడిల్, కొరియన్ నూడుల్స్, వివిధ మసాలా వేరియంట్‌లను సరసమైన రూ. 10కి మార్కెట్‌లోకి విడుదల చేసింది.

అయితే పరిమితిని మించి సీసం ఉందన్న ఆరోపణపై గతంలో నూడుల్స్‌ వినియోగాన్ని ఐదు నెలల పాటు బ్యాన్ చేశారు. దాని తర్వాత మ్యాగీ నూడుల్స్ అమ్మకాలు పుంజుకున్నాయి. ఇన్‌స్టంట్ నూడుల్స్‌ను నవంబర్ 2015లో పునఃప్రారంభించాక మార్కెట్‌కి తిరిగి వచ్చాయి.

ఒడిశాలో తన పదవ భారతీయ కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తున్న నెస్లే, మార్కెట్‌గా భారతదేశం యొక్క ప్రాముఖ్యతను పునరుద్ఘాటించారు ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ నారాయణన్ చెప్పారు. గత ఎనిమిదేళ్లలో 140కి పైగా ఉత్పత్తులను విడుదల చేశామని, 2023లో వినూత్న ఉత్పత్తుల అమ్మకాలు జోరందుకున్నాయని చెప్పారు.

నెస్లే ఇండియా మార్చి 31, 2024 వరకు పదిహేను నెలల్లో రూ. 24,275.5 కోట్ల విక్రయాలను నమోదు చేసింది.

Tags:    

Similar News