పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాంపై ఇండియా కూటమి సమావేశం

ఇండియా కూటమి డిసెంబర్‌ 19న సమావేశం కానుంది. పార్లమెంట్‌లో ఇటీవల జరిగిన ఘటన, శీతాకాల సమావేశాల నుంచి ఎంపీల బహిష్కరణ, తదితర అంశాలపై కూటమి నేతలు చర్చించనున్నారు .

Update: 2023-12-18 10:18 GMT


మూడు రాష్ట్రాల్లో బీజేపీ(BJP) విజయం సాధించింది. మూడు నెలల ఆ పార్టీ  విజయం తర్వాత ఇండియా (ప్రతిపక్షాల) కూటమి ఈ నెల 19న ఢిల్లీలోని హోటల్‌ అశోకాలో సమావేశమవుతుంది.

క్యాష్‌ ఫర్‌ క్వైరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) ఎంపీ  మహువా మొయిత్రాను ఇటీవల లోక్‌సభ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత ఇండియా కూటమి మధ్య చర్చలు పునఃప్రారంభం కానున్నాయి.

డిసెంబరు 13న పార్లమెంట్‌ హాల్‌లో జరిగిన ఘటనపై చర్చించాలని డిమాండ్‌ చేసిన 14 మంది ప్రతిపక్ష ఎంపీలను పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల నుంచి సస్పెండ్‌ చేశారు. 

మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లో కమలం పార్టీ వికసించింది. మరో నాలుగు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో.. సమావేశాల నిర్వహణ కంటే సీట్ల సర్దుబాటు, ప్రచారాలపై కలిసి పనిచేయడంపై ఇండియా కూటమి (INDIA Alliance) సభ్యులు దృష్టిపెట్టారు.

హిందీ బెల్ట్‌ రాష్ట్రాలలో కాంగ్రెస్‌(Congress) పార్టీ ఊహించని రీతిలో ఓడిపోయింది. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో గెలుపొందడం ఖాయమని ఆ పార్టీ నేతలు భావించారు. దురదృష్టవశాత్తు రాజస్థాన్‌తో పాటు ఆ రెండు రాష్ట్రాల్లో ఓడిపోయారు. తెలంగాణలో మాత్రమే విజయం సాధించగలిగారు. ఇండియా కూటమిలో తాము ప్రధాన పార్టీగా ఉండలేమన్న విషయం కాంగ్రెస్‌కు అర్థమైంది.

డిసెంబరు 3 ఎన్నికల ఫలితాల వెలువడ్డాయి. డిసెంబర్‌ 6న మిత్రపక్ష పార్టీల నేతల సమావేశం పెట్టాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే భావించారు. అయితే ఆయన ప్రతిపాదనను మమతా బెనర్జీ, అఖిలేష్‌ యాదవ్‌, నితీష్‌ కుమార్‌ తిరస్కరించడంతో ఆయన ఇబ్బందిపడ్డారు. ఓదార్పుగా.. ఖర్గే తన ఢిల్లీ నివాసంలో సీనియర్‌ ఎంపీలు, ఫ్లోర్‌ లీడర్‌లకు విందు ఇచ్చారు.

కలిపి పనిచేయడంపై దృష్టి పెట్టాలి...

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూటమి ఫ్రేమ్‌వర్క్‌ను అత్యవసరంగా పూర్తి చేయాల్సిన అవసరాన్ని గుర్తుచేశాయని ఇండియా కూటమిలోని వివిధ పార్టీల వర్గాలు ఫెడరల్‌కి తెలిపాయి. ‘‘ముంబై కాన్‌క్లేవ్‌, సెప్టెంబర్‌లో జరిగిన సమన్వయ కమిటీ సమావేశం తర్వాత ప్రతిదీ ఆగిపోయింది. అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించిన కాంగ్రెస్‌.. మితిమీరిన విశ్వాసం కారణంగా అఖిలేష్‌ యాదవ్‌ లాంటి భాగస్వాములను పట్టించుకోలేదు. పార్లమెంట్‌లో ఎక్కువ సీట్లున్న హిందీ రాష్ట్రాల్లో బీజేపీ బలపడిరది. ఎవరు బలవంతులు, ఎవరు నాయకత్వం వహించాలి అనే అంశాన్ని పక్కన పెట్టి.. కలిసి పనిచేయడం ప్రారంభించాలి. సీట్లను ఎలా పంచుకోవడంపై మాట్లాడాలి’’ అని తెలిపారు.

అనధికార చర్చలు...

ప్రస్తుతం పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న సమయంలో కూడా రోజూ ఇండియా కూటమి నేతలు, ఖర్గే (Mallikarguna Khadge) మధ్య అనధికారిక చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అఖిలేష్‌ వంటి నేతలను శాంతింపజేసేందుకే ఈ చర్చలు జరిగాయి. ఎంపీ ఎన్నికల సమయంలో కమల్‌నాథ్‌ తనను అవమానించారని కమల్‌నాథ్‌పై అఖిలేష్‌ ఆగ్రహంతో ఉన్నారు.

పరోక్షంగా సోనియా కూడా..

కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) కూటమిలోని కొంతమంది నాయకులతో టచ్‌లో ఉన్నారు. కూటమి విజయంపై హామీ ఇచ్చిన ఆమె.. మిత్రపక్షాల మధ్య ఏవైనా విభేదాలుంటే శాంతియుత చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌తో సత్సంబంధాలు కొనసాగించడం ఆమెకు ముఖ్యం. మొయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరించబడినప్పుడు సోనియా మొయిత్రాకు మద్దతు పలికింది. పార్లమెంటు మెట్ల మీద ఆమెకు సంఫీుభావం తెలిపింది. ఇది కేవలం న్యాయం గురించి మాత్రమే కాదు..తృనమూల్‌ కాంగ్రెస్‌కు కాంగ్రెస్‌ మద్దతు ఇస్తుందని చూపించడానికి కూడా.

డిసెంబర్‌ 13న జరిగిన పార్లమెంట్‌ భద్రతా ఉల్లంఘన ఘటనపై చర్చ జరపాలని డిమాండ్‌ చేసిన 14 మంది ప్రతిపక్ష ఎంపీలతో సోనియా కూడా నిరసనకు దిగారు.

డిసెంబర్‌ 19న జరిగే సమావేశం కూటమి భాగస్వాముల మధ్య అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది. సీట్లను పంచుకోవడంలో వారికి దోహదపడుతుందని చెప్పడానికి ఇంకొంత సమయం పడుతుంది. ఇదే సమావేశంలో కూటమి భాగస్వాములు ప్రధాని మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా దూకుడుగా మాట్లాడే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి.

డిసెంబర్‌ 13న పార్లమెంటులో భద్రతా లోపం ఏర్పడిరది. దాని గురించి మాట్లాడమని ప్రతిపక్షాలు చేసిన అభ్యర్థనను ప్రభుత్వం పట్టించుకోలేదు.నిందితులను పార్లమెంటులోకి ప్రవేశించడానికి సాయం చేసిన ఎంపీ ప్రతాప్‌ సింహా గురించి బిజెపి పార్టీ మౌనంగా ఉంది.

ఇప్పుడు ప్రధానిని అలాగే బీజేపీని విమర్శించడానికి భారత కూటమికి కారణాలు దొరికాయి. పార్లమెంట్‌లో సభ్యులకే రక్షణ లేకపోతే..దేశాన్ని ఎలా కాపాడతారని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. 2001 డిసెంబర్‌ 13న జరిగిన దాడి కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే హయాంలోనే జరిగిందని వారు గుర్తు చేశారు.

దర్యాప్తు చేస్తున్నాం..కేంద్రం

పార్లమెంట్‌లో జరిగిన ఘటనను సీరియస్‌ తీసుకున్నామని, బాధ్యులను అదుపులోకి

విచారిస్తున్నామని కేంద్రం పేర్కొంది. ఆ వివరణతో కాంగ్రెస్‌ దాని మిత్ర పక్షాలు సంతృప్తి చెందలేదు. ఈ ఘటనపై ప్రధాని లేదా హోంమంత్రి అమిత్‌ షా నోరు విప్పేవరకు పార్లమెంట్‌లో నిరసనలు తెలపుతామని కూటమి నేతలు స్పష్టం చేశారు.

నిరుద్యోగం, ధరల పెరుగుదల, మణిపూర్‌లో అశాంతి కారణంగా యువకులు పార్లమెంటును ముట్టడిరచవలసి వచ్చిందని ఇండియా కూటమి పేర్కొంది. ఈ సమస్యలను కూటమి సభ్యులు చాలాసార్లు ప్రస్తావించారు కూడా.

కుల గణనపై ఇండియా కూటమి ప్రతిపాదనను బీజేపీ తిరస్కరిస్తూ.. అసెంబ్లీ ఎన్నికల్లో విజయాలను సొంతం చేసుకుంటున్నారు. కుల గణన డిమాండ్‌పై మమతా బెనర్జీతో పాటు ఇండియా కూటమి గట్టి నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు.

Tags:    

Similar News