ఆసిమ్ మునీర్ ను ఎగతాళి చేసిన భారత ఆర్మీ చీఫ్
దెబ్బతిన్నప్పటికీ ఫీల్డ్ మార్షల్ తీసుకోవడంపై విమర్శలు, పాక్ కు ఇది అలవాటే అని గుర్తు చేసిన భారత్;
By : The Federal
Update: 2025-08-10 13:11 GMT
ఆపరేషన్ సిందూర్ తరువాత పాక్ తో జరిగిన సైనిక ఘర్షణలో పాక్ ఘోరంగా దెబ్బతిన్నప్పటికీ పాకిస్తాన్ జనరల్ కు ఆసిమ్ మునీర్ ఫీల్డ్ మార్షల్ హోదా తీసుకోవడంపై ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ ఎగతాళి చేశారు.
తనను తాను విజేతగా చిత్రీకరించుకోవడానికి ఇస్లామాబాద్ ఇలాంటి కుట్రకు తెరతీసిందని విమర్శించారు. పాకిస్తాన్ విజయాన్ని తనకు తానుగా ప్రకటించుకోవడానికి జనరల్ మునీర్ ను ఇస్లామాబాద్ ప్రొత్సహించిందని ఆర్మీ చీఫ్ అన్నారు.
విజయం.. మనసులో..
ఐఐటీ మద్రాస్ లో జరిగిన ఒక సభలో ప్రసంగిస్తూ జనరల్ ద్వివేదీ మాట్లాడారు. ‘‘విజయం మనసులో ఉంటుంది. అది ఎల్లప్పుడూ మనసులోనే ఉంటుంది. నువ్వు ఓడిపోయావా లేదా గెలిచావా అని ఒక పాకిస్తానీని అడిగితే అతను నా చీఫ్ ఫీల్డ్ మార్షల్ అయ్యాడని, కాబట్టి మనం గెలచి ఉండాలని చెబుతాడు’’ అని అన్నారు.
ఆసిమ్ మునీర్ పదోన్నతిని పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. అతను(మునీర్) దేశభద్రతను నిర్ధారించడం, శత్రువును ఓడించడం’’ వల్ల ఈ అభివృద్ది జరిగిందని పేర్కొంది.
‘‘మీరు ప్రజలను ఇలా ప్రభావితం చేయవచ్చు.. అది దేశీయ జనాభా, విరోధుల జనాభా, తటస్థ జనాభా.. పెరుగుతున్న శక్తులకు అనుగుణంగా ఉండగలరా, అదే మీరు అడగాల్సిన ప్రశ్న, మీకు సమాధానం దొరుకుతుంది’’ అని ఆర్మీ చీఫ్ అన్నారు.
కథనాన్ని నియంత్రించడం..
పాకిస్తాన్ చేసిన కుట్రలను భారత్ తిప్పికొట్టిందని అన్నారు. త్రివిధ దళాలు తమ విజయాన్ని ప్రజలకు తెలియజేయడానికి సోషల్ మీడియాతో పాటు ఇతర వేదికలను ఉపయోగించడం ద్వారా దాయాదీకి చెక్ పెట్టిందని అన్నారు. ఆపరేషన్ సిందూర్ అన్ని లక్ష్యాలను సాధించిందని అన్నారు.
‘‘ విజయం సాధించామని చెప్పడం పాత అలవాటు. 1971, 1975, 1999 కార్గిల్ యుద్ధంలో కూడా వారు అలాగే చేశారు.’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మే నెలలో అన్నారు. భారత్- పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించిన కొన్ని రోజుల తరువాత ఈ వ్యాఖ్యలు చేశారు.
వ్యూహాత్మక సందేశం..
భారత్ వ్యూహాత్మక సందేశం ప్రపంచ ప్రభావాన్ని కూడా ఆర్మీ చీఫ్ హైలైట్ చేశారు. ఆర్మీ, వైమానిక దళానికి చెందిన ఇద్దరు మహిళా అధికారులు నిర్వహించిన విలేకరుల సమావేశాలు కీలక పాత్ర పోషించాయని ఆయన పేర్కొన్నారు. కథనం నిర్వహించడంలో ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ.. ఒక లోగోను లెప్టినెంట్ కల్నల్, ఒక ఎన్సీఓ రూపొందించారని ఆయన చెప్పారు.
చదరంగం ఆట..
ఈ ఆపరేషన్ సిద్దాంతపరమైన మార్పును సూచిస్తుందని దానిని చదరంగంతో పోల్చారు. ఇక్కడ శత్రువు కదలిక అనూహ్యమని జనరల్ ద్వివేదీ విద్యార్థులు, అధ్యాపకులతో అన్నారు.
‘‘మేము చెస్ ఆడాము. శత్రువు తదుపరి కదలిక ఏమిటనేది...ఏమి చేయబోతున్నామో మాకు తెలియదు. దీనిని గ్రేజోన్ అంటారు. గ్రే జోన్ అంటే మనం సంప్రదాయ కార్యకలాపాలకు వెళ్లడం లేదు.
మనం చేస్తున్నది సంప్రదాయ ఆపరేషన్ కంటే చాలా తక్కువ. మేము ఎత్తులు వేస్తున్నాము. శత్రువు కూడా ఎత్తులు వేస్తున్నాడు’’ అని ఆర్మీ చీఫ్ వ్యాఖ్యానించారు.
ఫ్రీ హ్యాండ్..
ప్రధాని నరేంద్రమోదీ, రక్షణ మంత్రితో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని అన్నారు. ఈ స్వేచ్ఛ ఇచ్చిన రాజకీయ సంకల్పాన్ని ఆర్మీ చీఫ్ ప్రశంసించారు.
‘‘ఏప్రిల్ 23న మేమందరం కూర్చున్నాము. రక్షణ మంత్రి చాలు చాలు అని చెప్పడం ఇదే మొదటిసారి. ముగ్గురు ముఖ్యులు ఏదో ఒకటి చేయాల్సిందే అని చాలా స్పష్టంగా చెప్పారు. ఏం చేయాలో మీరే నిర్ణయించుకోండి అని ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. మేము మొదటిసారి విశ్వాసం, రాజకీయ దిశ, రాజకీయ స్పష్టత అదే’’ అని ద్వివేదీ అన్నారు.
జమ్మూకశ్మీర్ లోని పహల్గామ్ లో 26 మంది పర్యాటకులల్లో హిందువులని గుర్తించి భార్యల ఎదుట భర్తలను పాక్ ఉగ్రవాదులు కాల్చి చంపారు. దీనికి ప్రతిస్పందనగా మే 7న భారత్ ఆపరేషన్ సిందూర్ ను ప్రారంభించింది. దీనికి బలమైన రాజకీయ సంకల్పం, ప్రభుత్వం నుంచి స్పష్టమైన వ్యూహాత్మక దిశానిర్దేశంతో నడిపించబడిందని ఆర్మీ చీఫ్ చెప్పారు.