రెచ్చిపోయిన సన్‌రైజర్స్‌..

రాయల్ ఛాలెంజర్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పరుగుల సునామీ సృష్టించింది. ఆర్సీబీ బౌలర్లకు చెమటలు పట్టిస్తూ.. బౌండరీల వర్షం కురిపించారు.

Update: 2024-04-16 10:59 GMT
ఐపీఎల్ 2024..ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించింది. ఆర్సీబీ బౌలర్లకు చెమటలు పట్టిస్తూ.. బౌండరీల వర్షం కురిపించారు. నిర్ణీత 20 ఓవర్లలో సన్‌రైజర్స్ మూడు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసి, ఆర్సీబీ ముందు లక్ష్యాన్ని ఉంచింది. ఐపీఎల్‌ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. ఇదే సీజన్‌లో ముంబై ఇండియన్స్‌పై 277 పరుగులు చేసి హయ్యస్ట్ స్కోరర్‌గా నిలిచిన సన్‌రైజర్స్.. ఇప్పుడు తన రికార్డ్‌ని తానే తిరగరాసింది.
ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్‌లో విజృంభించాడు. బెంగళూరు బౌలర్లపై షాట్లతో ఊచకోత మొదలుపెట్టిన ఈ ఆస్ట్రేలియన్ ఆటగాడు.. 41 బంతుల్లోనే 9 ఫోర్లు, 8 సిక్సుల సహకారంతో 102 పరుగులు చేశాడు. అతనితో పాటు ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్ శర్మ సైతం.. క్రీజులో ఉన్నంతవరకు ఉతికి ఆరేశాడు. 22 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్సుల సహకారంతో 34 పరుగులు చేశాడు. ఇక అభిషేక్ ఔట్ అయ్యాక వచ్చిన క్లాసెన్.. ఎప్పట్లాగే మాస్ ఇన్నింగ్స్‌తో దుమ్ముదులిపేశాడు. తొలుత క్రీజులో కుదుర్కునేందుకు కొంత సమయం తీసుకున్న అతడు.. ఆ తర్వాత పరుగుల మోత మోగించాడు. 31 బంతుల్లోనే 2 ఫోర్లు, 7 సిక్సుల సహకారంతో 67 పరుగులు చేశాడు.
చివర్లో మార్క్‌రమ్‌తో పాటు అబ్దుల్ సమద్ కూడా అదరగొట్టేశాడు. ఒకరికి మించి మరొకరు పోటీ పడి మరీ బౌండరీల మోత మోగించారు. సమద్ కేవలం 10 బంతల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేయగా.. మార్క్‌రమ్ 17 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్సుల సహకారంతో 32 పరుగులు చేశాడు. ఇలా సన్‌రైజర్స్ బ్యాటర్లందరూ మెరుపు ఇన్నింగ్స్ ఆడటం వల్ల.. ఆ జట్టు చారిత్రాత్మక స్కోరుని నమోదు చేయగలిగింది. మూడు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేయగలిగింది.
హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ శర్మ (సి) ఫెర్గూసన్‌ (బి) టాప్లీ 34; హెడ్‌ (సి) డుప్లెసిస్‌ (బి) ఫెర్గూసన్‌ 102; క్లాసెన్‌ (సి) వైశాఖ్‌ (బి) ఫెర్గూసన్‌ 67; మార్‌క్రమ్‌ నాటౌట్‌ 32; సమద్‌ నాటౌట్‌ 37; ఎక్స్‌ట్రాలు 15
మొత్తం: 20 ఓవర్లలో 3 వికెట్లకు 287
వికెట్ల పతనం: 1-108, 2-165, 3-231
బౌలింగ్‌: విల్‌ జాక్స్‌ 3-0-32-0; టాప్లీ 4-0-68-1; యశ్‌ దయాళ్‌ 4-0-51-0; ఫెర్గూసన్‌ 4-0-52-2; వైశాఖ్‌ 4-0-64-0; లొమ్రార్‌ 1-0-18-0
బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (బి) మార్కండే 42; డుప్లెసిస్‌ (సి) క్లాసెన్‌ (బి) కమిన్స్‌ 62; జాక్స్‌ రనౌట్‌ 7; పటీదార్‌ (సి) నితీశ్‌ (బి) మార్కండే 9; సౌరభ్‌ చౌహాన్‌ ఎల్బీ (బి) కమిన్స్‌ 0; దినేశ్‌ కార్తీక్‌ (సి) క్లాసెన్‌ (బి) నటరాజన్‌ 83; లొమ్రార్‌ (బి) కమిన్స్‌ 19; అనుజ్‌ నాటౌట్‌ 25; విజయ్‌కుమార్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 14
మొత్తం: 20 ఓవర్లలో 7 వికెట్లకు 262
వికెట్ల పతనం: 1-80, 2-100, 3-111, 4-121, 5-122, 6-181, 7-244
బౌలింగ్‌: అభిషేక్‌శర్మ 1-0-10-0, భువనేశ్వర్‌ 4-0-60-0, షాబాజ్‌ అహ్మద్‌ 1-0-18-0,నటరాజన్‌ 4-0-47-1, కమిన్స్‌ 4-0-43-3, మార్కండే 4-0-46-2; జైదేవ్‌ ఉనద్కత్‌ 2-0-37-0
సన్‌రైజర్స్‌ ఇప్పుడా రికార్డును మెరుగుపర్చుకుంది. ప్రపంచ టీ20ల్లో నేపాల్‌దే (మంగోలియాపై 314/3) రికార్డు.
Tags:    

Similar News