ఐపీఎల్: మయాంక్ టూ రఘువంశీ, యంగ్ క్రికెటర్ల ప్రతిభా వేదిక

మిస్సైల్ వేగంతో బంతులు వేస్తున్న క్రికెటర్, బౌలర్ ఎవరైనా లెక్క చేయకుండా వీర విహారం చేస్తున్న యంగ్ బ్యాట్స్ మెన్లు.. ఐపీఎల్ లీగ్ లో ఇప్పటి వరకూ జరిగిన..

By :  R Kaushik
Update: 2024-04-05 11:16 GMT

ఐపీఎల్, ప్రపంచంలోనే రెండో ధనిక లీగ్ గా పేరు తెచ్చుకుంది. వేల కోట్ల బిజినెస్ దీని కేంద్రంగా జరుగుతోంది. ఇది క్రేజ్ పరంగా యూరోప్ పుట్ బాల్, అమెరికా బాస్కెట్ బాల్ లాంటి వాటికి కూడా సవాల్ విసురుతోంది. ఆ సంగతి అటుంచితే లీగ్ వల్ల దేశ వ్యాప్తంగా ఉన్న అనామక క్రికెటర్లను రాత్రికి రాత్రే స్టార్ లు గా మార్చేసింది. ఇప్పుడు జరుగుతున్న 17 వ సీజన్ లో కూడా కొత్త ఆటగాళ్లు మైదానం సాక్షిగా దూసుకొచ్చారు.

బుల్లెట్ల లాంటి బంతులతో ఒకరు బ్యాట్స్ మెన్ కు షాక్ ఇస్తూంటే.. అద్వితీయ ఆట తీరుతో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న బ్యాట్స్ మెన్ మరికొందరు వీరంతా నిండా పాతికేళ్ల లోపే వారు కావడం ఇక్కడ చెప్పుకోదగ్గ మరో విషయం. పైగా వీరంతా విదేశీయులు కాదు.. భారతీయులు కావడంతో త్వరలో టీమిండియాలో వీరినే చూసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆరేంజ్, పర్పుల్ క్యాప్ ల పోటీ లో ఉన్నది కూడా భారతీయులే.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో మూడింటిని ఓడిపోయినప్పటికీ, విరాట్ కోహ్లీ టోర్నమెంట్-అత్యధిక 203 పరుగులు సాధించి ఆరేంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు. ఇది తాత్కాలికమే అయినప్పటికీ.. రన్-స్కోరింగ్ చార్ట్‌లో అతని క్రింద వెంటనే IPL అనుభవజ్ఞుడైన ఒక యువకుడు ఉన్నాడు. అతను 2019లో అరంగేట్రం చేసాడు, కానీ ఇప్పుడిప్పుడే తన గేమ్ ను బయటకు ప్రారంభించాడు.
రియాన్ పరాగ్ ..
రియాన్ పరాగ్.. ఈ అస్సామీ మూలాలు ఉన్నా కుర్రాడు గత నాలుగు ఎడిషన్లుగా రాజస్థాన్ రాయల్స్ తో ఉన్నాడు. ఇంకా చాలామంది అస్సామీ కుర్రాళ్లు కూడా ఈ జట్టుతో అనుబంధ కొనసాగిస్తున్నారు. వీరిని చూస్తే తూర్పు- పడమర కలిసినట్లు ఉంది. కానీ పరాగ్ కు ఎప్పుడు కూడా సరైన అవకాశాలు రాలేదనే చెప్పాలి. కానీ 2024లో అతడి ప్రతిభ చూశాక ఆలస్యం చేశామనే భావన ఆర్ ఆర్ టీమ్ కు వచ్చే ఉంటుంది. ఎందుకుంటే
గత మూడు ఇన్నింగ్స్‌లలో 181 పరుగులు చేసిన రియాన్, అతని స్ట్రైక్-రేట్ మాత్రం 160.17. కోహ్లి కంటే ఉత్తమంగా రాణిస్తున్నాడు. ఒకప్పుడు ఫినిషర్ గా చివర నంబర్లలో బ్యాటింగ్ చేసేవాడు. ఇప్పుడు ప్రతిభతో నంబర్ 4 కి ఎగబాకాడు. తన బ్యాటింగ్ లో ఫైర్ పవర్ కారణంగా అతనికి యాజమన్యం కూడా స్వేచ్ఛగా ఆడుకునే లగ్జరిని పొందాడు. ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టడం, అవసరమైనప్పుుడు గేరు మార్చి బ్యాటింగ్ చేసే సామర్థ్యం రెండింటిని పరాగ్ ఒడిసిపట్టాడనే చెప్పుకోవాలి.
వికెట్ తీసుకున్న ప్రతిసారీ తమకు సొంతమైన బిహూ డ్యాన్స్ తో ప్రేక్షకుల అటెన్షన్ కూడా డైవర్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు తన పేరు టీ 20 ప్రపంచ కప్ లో లేకపోతే ప్రశ్నించే స్థాయికి తన ఆటతీరుతో ఎదిగాడు.
మయాంక్ యాదవ్ పేస్ కింగ్..
బంగ్లాదేశ్ మాస్ట్రో ముస్తాఫిజుర్ రెహ్మాన్ ప్రస్తుతం వరకూ ఏడు వికెట్లు తీసి పర్బుల్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు. అయితే ఈ జాబితాలోకి తుఫాన్ వేగంతో దూసుకొచ్చిన వ్యక్తి.. ఢిల్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ మయాంక్ యాదవ్. 2022లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ద్వారా ఎంపికైనప్పటికీ, పెద్దగా అవకాశాలు రాలేదు.
గత శనివారం వరకు అతను IPL గేమ్ ఆడలేదు. కానీ ఆడిన రెండు గేమ్ ల్లో తన అసాధారణ ప్రతిభ, వేగం, నియంత్రణ కలగలిపి వేసిన బంతులకు దిగ్గజ బ్యాట్స్ మెన్ గా పేరుగాంచిన వారు కూడా బొల్తా కొట్టారు. దీంతో భారత్ కు మరో సూపర్ హీరో లాంటి బౌలర్ దొరికాడని క్రికెట్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగితేలుతున్నారు. ప్రస్తుతం భూమ్రానే జట్టు భారం మోస్తున్నాడు. షమీ గాయంతో ఉన్నాడు. సిరాజ్ అనుకున్నంత ప్రభావం వైట్ బాల్ క్రికెట్ లో చూపించలేకపోతున్నాడు. మరికొంత మంది ఫాస్ట్ బౌలర్లు ఉన్నారంటే ఉన్నారనే చెప్పుకునే విధంగా ఉంది. కానీ మయాంక్ రాకతో దేశ బౌలింగ్ డిపార్ట్ మెంట్ మొత్తం కూడా ఫుల్ కుష్ తో ఉంది.
లక్నోలో పంజాబ్ కింగ్స్ (PBKS)తో జరిగిన అరంగేట్రంలో, మయాంక్ పదే పదే 150 kmph వేగాన్ని తాకడం 156.7 కి. మీ వేగంతో రికార్డు బ్రేక్ చేయడం ద్వారా ఆకట్టుకున్నాడు, తన నాలుగు ఓవర్లలో 27 పరుగులకు మూడు వికెట్లతో ముగించాడు. ఇతని ప్రతిభ కారణంగా లక్నో మొదటి విజయాన్ని సాధించింది. తరువాత బెంగళూర్ తో జరిగిన మ్యాచ్ లో కూడా సత్తా చాటాడు. ఇక్కడ కూడా అదే వేగం, అదే నియంత్రణతో బౌలింగ్ వేసి తన ప్రతిభ గాలివాటం కాదని నిరూపించుకున్నాడు.
అతను తన ఎక్స్‌ప్రెస్ పేస్‌తో గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్‌లను ఆశ్చర్యపరిచాడు. అనుకున్న దానికంటే వేగంగా వచ్చిన బంతిని ఆడలేక క్యాచ్ ఇచ్చి వెనుదిరగగా, కామెరూన్ గ్రీన్ బ్యాట్, ప్యాడ్ సందుల్లో నుంచి బాల్ దూసుకెళ్లి ఆఫ్ స్టంప్ ను గిరాటేసింది. RCB అభిమానులు కూడా, యువకుడి నైపుణ్యం, నియంత్రణను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. నాలుగు ఓవర్లలో 14 పరుగులకు మూడు వికెట్లు వరుసగా రెండోసారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు.
అంగ్క్రిష్ రఘువంశీ ..
ఈ ఐపీఎల్ లో మహిపాల్ లోమ్రోర్‌ను తీసుకోండి. కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్, మాక్స్‌వెల్, గ్రీన్‌ల ప్రముఖ త్రయం పరుగులు చేయడానికి ఇబ్బందిపడుతుంటే.. లోమ్రోర్ ఉత్సాహంతో ఇంపాక్ట్ ప్లేయర్ పాత్రను స్వీకరించాడు, జట్టు సాధించిన ఏకైక విజయంలో దినేష్ కార్తీక్‌తో పాటు ముఖ్యమైన పాత్ర పోషించింది లోమ్రోర్. ఆ రోజు మయాంక్ తన పేస్ తో బెంగళూర్ ను కకావికలం చేస్తుంటే లోమ్రోర్ మాత్రం స్వేచ్చగా బ్యాటింగ్ చేశారు. మరో యువ బ్యాట్స్ మెన్. అంగ్క్రిష్ రఘువంశీ కేకేఆర్ తరఫున ఆడుతున్నాడు. ఈ రైట్ హ్యాండర్ ముంబై ప్లేయర్ కావడం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం.
2022లో కరీబియన్‌లో దీవుల్లో నిర్వహించిన అండర్-19 ప్రపంచ కప్ విజయం సాధించిన హీరోలలో రఘువంశీ ఒకడు. 18 సంవత్సరాల 303 రోజుల వయసులో IPLలో తన మొదటి మ్యాచ్ లో అర్ధ సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డ్ క్రియెట్ చేసుకున్నాడు. కేవలం 25 బంతుల్లోనే ఈ అర్ధ సెంచరీ సాధించాడు.
గత ఐపీఎల్ లో కూడా అనేక మంది కొత్త ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. అయితే వారు తమ ప్రతిభను తరువాత కొనసాగించలేకపోయారు. ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువ మంది క్రీడాకారులు వెలుగులోకి వచ్చారు. వీరు తమ అద్భుతమైన ప్రారంభాలను కొనసాగించలేకపోతే తమను తామే నిందించుకోవాల్సి ఉంటుంది.
Tags:    

Similar News