ఐపీఎల్: తనంత తానుగా తప్పుకోనున్నాడా? తప్పిస్తారా
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ గా కేఎల్ రాహూల్ ను యాజమాన్యం తప్పించబోతుందా? లేకపోతే రాహూల్ తనంత తానుగా తప్పుకోనున్నారా అనే వార్తలు..
లక్నో సూపర్ జెయింట్స్ తదుపరి మ్యాచ్ లకు కెప్టెన్ గా కేఎల్ రాహూల్ తప్పుకోనున్నాడా అనే సందేహాలు వస్తున్నాయి. ఇప్పటికే ఐపీఎల్ ప్లే ఆఫ్ కు లక్నో సాంకేతికంగా ఇంకా పోటీలోనే ఉంది. ఆ జట్టు మరో రెండు మ్యాచ్ లను ఆడాల్సి ఉంది.
బుధవారం హైదరాబాద్ తో మ్యాచ్ ఓడిన అనంతరం లక్నో జట్టు యజమాని రాహూల్ ను పబ్లిక్ గా మందలించడం పై తీవ్ర దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. అభిమానులు, క్రీడా పండితులు రాహూల్ కు అండగా నిలబడ్డారు. అయితే రాహూల్ తదుపరి మ్యాచ్ లకు కెప్టెన్ గా, ఆటగాడిగా అందుబాటులో ఉంటాడా అనే విషయంలో అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి.
2022లో ఐపీఎల్ వేలంలో రాహూల్ రికార్డు స్థాయిలో రూ. 17 కోట్లకు అమ్ముడయ్యాడు. అయితే 2025 వేలంలో తిరిగి మెగావేలంలో రాహూల్ ను విడుదల చేసే అవకాశం ఉందని ఊహగానాలు వస్తున్నాయి. అసలు వచ్చే రెండు మ్యాచ్ లకు కూడా కేఎల్ కెప్టెన్ గా ఉండటానికి ఇష్టపడకపోవచ్చని అన్నారు.
తను తదుపరి గేమ్ లలో బ్యాటింగ్ ను మెరుగు పరచుకోవడానికి ఎక్కువ దృష్టి పెట్టేందుకు కెప్టెన్సీని విడిచి పెట్టే అవకాశం ఉందని జాతీయ మీడియా వార్తలు ప్రసారం చేసింది. ‘‘ డీసీతో మరో మ్యాచ్ కు ఇంకో ఐదు రోజుల గ్యాప్ ఉంది. ప్రస్తుతానికి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మిగిలిన మ్యాచ్ ల కోసం రాహూల్ బ్యాటింగ్ కోసం తన గేమ్ పై దృష్టి సారించాలని ప్లాన్ చేసిన. జట్టు మేనేజ్ మెంట్ పట్టించుకోదని అర్ధమైంది’’ అని జట్టు పరిస్థితులపై జాతీయ మీడియాలో ఓ కథనం ప్రచురితమైంది.