ఈ టెస్ట్ సిరీస్ లో నిజమైన తేడాను సృష్టించింది మన ఫాస్ట్ బౌలర్లే: గిల్

ఇంగ్లండ్ తో తలపడుతున్న టెస్ట్ సిరీస్ లో ప్రధాన తేడా ఫాస్ట్ బౌలర్లే అని యువ బ్యాట్స్ మెన్ శుభ్ మన్ గిల్ అన్నారు. పేస్ బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారని కొనియాడారు.

Update: 2024-02-21 12:22 GMT
శుభ్ మన్ గిల్, ఇండియా క్రికెటర్

ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో మనకు ఆధిక్యం రావడానికి ఫాస్ట్ బౌలర్లే కారణమని భారత యువ బ్యాట్స్ మెన్ శుభ్ మన్ గిల్ అభిప్రాయపడ్డారు. దేశంలో పిచ్ లు స్పిన్నర్లుకు అనుకూలంగా ఉంటాయని పేరున్నప్పటినీ ఫాస్ట్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారని కొనియాడారు. మనకు, ప్రత్యర్థికి ప్రధాన తేడా ఇదేనని చెప్పారు.

భారత్ తరఫున నలుగురు స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్( 11), రవీంద్ర జడేజా(12), కుల్దీప్ యాదవ్(8), అక్షర్ పటేల్(5) కలిసి మూడు మ్యాచ్ ల్లో 36 వికెట్లు తీయగా, ఇప్పటి వరకూ పేసర్లు మాత్రం 22 వికెట్లు తీశారని గిల్ వివరించాడు. స్పిన్నర్లు ఎక్కువ వికెట్ల తీసుకున్నట్లు నంబర్లు కనిపిస్తున్నప్పటికీ కీలక సమయాల్లో వికెట్లు తీసి జట్టును పోటీలోకి తీసుకొచ్చింది మాత్రం పేసర్లే అని కొనియాడాడు.

" భారత్ లో ఎక్కడా ఆడిన స్పిన్నర్లు పిచ్ లు సహకరిస్తాయి. యాష్, జడ్డూ భాయ్ ఎలాగైన వికెట్లు తీస్తారు. మా ఫాస్ట్ బౌలర్లు బౌలింగ్ చేసిన విధానం మాత్రం ఈ సిరీస్ లో మార్పు తెచ్చింది" అని అభిప్రాయపడ్డారు. రాజ్ కోట్ టెస్ట్ లో సిరాజ్ నాలుగు వికెట్లు తీసిన విధానాన్ని ఉటంకిస్తూ.. భారత పేసర్లు ఇలాంటి పరిస్థితుల్లో వికెట్లు తీయడానికి కూడా తగినంత అనుభవం ఉందని చెప్పారు. ముఖ్యంగా పిచ్ నిర్జీవంగా ఉన్నప్పుడు దాని నుంచి రివర్స్ సింగ్ రాబట్టడంలో మా పేసర్లుకు తగినంత అనుభవం ఉందని తాను భావిస్తున్నట్లు చెప్పాడు. అయితే వర్క్ లోడ్ కారణంగా నాలుగో టెస్ట్ నుంచి ప్రధాన పేసర్ భూమ్రాను తప్పిస్తున్నట్లు చెప్పాడు.

విరాట్, భూమ్రా విశ్రాంతి తీసుకోవడం యువ ఆటగాళ్లకు లభించిన సదవకాశంగా భావిస్తున్నామని, వారు తమ ప్రతిభను చూపడానికి దీనిని సరైన అవకాశంగా భావిస్తున్నారని గిల్ అభిప్రాయపడ్డారు. రాజ్ కోట్ లో రెండు ఇన్సింగ్స్ లో అర్థ సెంచరీలతో రాణించిన సర్పరాజ్ ఖాన్ ను ఇందుకు ఉదాహరణగా చెప్పాడు.

" విరాట్ భాయ్ మూడు టెస్టులకు మాతో అందుబాటులో లేడు. ఉత్తమ ఆటగాడు మాతో లేకపోవడం కొంచెం తేడాను కలిగిస్తుంది. కానీ సర్పరాజ్ వచ్చి బాగా ఆడాడని నేను అనుకుంటున్నాను. వచ్చిన అవకాశాలను బాగా ఉపయోగించుకోవడంలో యువ ఆటగాళ్లు ముందున్నారనే అనుకుంటున్నాను. " అని ఈ పంజాబ్ ఆటగాడు చెప్పాడు.

యశస్వి జైశ్వాల్ ఇక్కడ తనకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతుల పట్టుకుని తనేంటో నిరూపించుకున్నాడు. వరుసగా రెండు డబుల్ సెంచరీలు సాధించిన సిరీస్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ప్రతిభ లేకపోతే ఎవరూ డబుల్ సెంచరీలు సాధించలేరు అని చెప్పుకొచ్చాడు. 

Tags:    

Similar News