‘ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ తప్పక వస్తుంది’

బీహార్ అధికార జనతాదళ్ (యునైటెడ్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎవరిని ఎన్నుకున్నారు. ఆయన మోదీ గురించి ఏమన్నారు?

Update: 2024-06-29 10:53 GMT

బీహార్ అధికార జనతాదళ్ (యునైటెడ్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ ఝా ఎంపికయ్యారు. ఈ మేరకు శనివారం న్యూఢిల్లీలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ అంశం కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చిందని సీనియర్ నాయకుడు నీరజ్ కుమార్ తెలిపారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు బలమైన చట్టాన్ని తీసుకురావాలని జెడి(యు) అభిప్రాయపడిందని తెలిపారు. బీహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) అధ్యక్షుడు నితీశ్ కుమార్, ఇతర సీనియర్ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

మోడీని ప్రశంసించిన ఝా

సంజయ్ ఝా JD(U)ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రకటించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీహార్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ తప్పక వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News