జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు బెయిల్
భూ కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది.
By : The Federal
Update: 2024-06-28 07:35 GMT
భూ కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. సోరెన్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు జూన్ 13న తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే.
కాగా జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) కార్యనిర్వాహక అధ్యక్షుడు సోరెన్‌ను జనవరి 31న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ కేసు దర్యాప్తునకు సంబంధించి అరెస్టు చేసింది.
జార్ఖండ్‌లో అత్యంత విలువైన భూ యాజమాన్య హక్కుల్ని సోరెన్ మార్పించారన్నది ఆయనమీదున్న ఆరోపణ. సోరెన్ రూ. 600 కోట్ల భూకుంభకోణానికి పాల్పడి, వచ్చిన డబ్బును విదేశాలను తరలించాడని ఈడీ ఆయనను అరెస్టు చేసింది. దీంతో సోరెన్ తన పదవికి రాజీనామా చేశారు. హేమంత్ స్థానంలో చంపాయీ సోరెన్ సీఎం పగ్గాలు చేపట్టారు.