బాత్రూమ్ లో కాలు జారిపడ్డ కెసిఆర్, ఆసుపత్రిలో చికిత్స

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నిన్న అర్థరాత్రి రాత్రి తన ఫాంహౌస్‌ బాత్రూంలో జారిపడ్డారు.

Byline :  The Federal
Update: 2023-12-08 03:56 GMT
కెసిఆర్

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నిన్న రాత్రి తన ఫాంహౌస్‌ బాత్రూంలో జారిపడ్డారు.

ఆయన కాలికి గాయం కావడంతో ఆర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఆయనను హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. కేసీఆర్‌ తుంటి ఎముకకు గాయమైందని వైద్యులు తెలిపారు.

శస్త్రచికిత్స కూడా అవసరం అవుతుందని సూచించారని తెలసింది.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. విషయం గురించి తెలియగానే కేసీఆర్‌ కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలివెళ్లారు. మాజీ సీఎం కేసీఆర్‌ సోమాజీగూడలోని యశోద ఆసుపత్రిలో చేరారు. బాత్రూంలో గత రాత్రి ఆయన కాలు జారి పడిపోడంతో ఆయనకు గాయమైంది. తాజాగా ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి.

కేసీఆర్‌ కాలి తుంటి ఎముక విరిగిందని వైద్యులు వెల్లడించినట్టు సమాచారం. కేసీఆర్‌కు శస్త్ర చికిత్స చేయాల్సి రావొచ్చని, వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఈ విషయంపై వైద్యులు నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.. కేటీఆర్, హరీశ్‌ రావు, కవిత ఆసుపత్రికి వెళ్లి వైద్యులతో చర్చించారు. ప్రస్తుతం కేసీఆర్‌కు వైద్య పరీక్షలు జరుగుతున్నాయి.

అనంతరం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.


Tags:    

Similar News