పాక్ మాజీ మంత్రిని పని చూసుకోమన్న కేజ్రీవాల్

భారత్ జోలికి రావొద్దంటూ పాకిస్థాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరీకి కేజ్రీవాల్ ఘాటు రిప్లై ఇచ్చారు. కానీ వాళ్ల మధ్య సత్సంబంధాలున్నాయని బీజేపీ అంటోంది. ఎందుకు..

Update: 2024-05-25 14:26 GMT

‘‘మా సమస్యలు తీర్చుకునే సత్తా మాకు, మా ప్రజలకు ఉంది. ఇందులో మీ జోక్యం ఏమాత్రం అవసరం లేదు. ప్రపంచంలో ఉగ్రవాదానికి అతిపెద్ద ప్రోత్సాహమిచ్చే మీ లాంటి దేశం దగ్గర ఏం నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు’’ పాక్ మాజీ మంత్రి ఫవాద్ హుస్సేన్ చౌదరికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ ఇది. భారతదేశమంతటా ఆరో దఫా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సందర్భంగా.. ‘‘ద్వేషాన్ని పెంపొందించే, తీవ్రవాద భావాలు ఉన్న శక్తులు ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోవాలి’’ అంటూ ట్వీట్ చేశారు. ఆ ఎక్స్(ట్వీట్)పై స్పందించిన కేజ్రీవాల్.. ఘాటుగా బదులిచ్చారు. లోక్‌సభ ఎన్నికలు అనేవి భారతదేశ అంతర్గత అంశమని, ఇలాంటి విషయాల్లో అతిపెద్ద ఉగ్రవాద తయారీ దేశమైన మీ జోక్యాన్ని మేము, మా దేశం ఎట్టిపరిస్థితుల్లో సహించదంటూ సమాధానం ఇచ్చారు.

ఓటేసిన కేజ్రీవాల్

లోక్‌సభ ఐదో దఫా పోలింగ్ సందర్భంగా కేజ్రీవాల్ తన కుటుంబీకులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. బయటకు వస్తూ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసినట్లు చూపుతూ ఫొటోలు దిగారు. అలాంటి ఫొటోనే సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తూ.. ‘‘ఈరోజు నియంతృత్వం, ద్రవ్యోల్ంబనం, నిరుద్యోగానికి వ్యతిరేకంగా ఓటు వేశాం’’ అని ఎక్స్(ట్వీట్) చేశారు. కేజ్రీవాల్ పోస్ట్ పెట్టిన కొద్ది సేపటికే ఆ పోస్ట్‌ను షేర్ చేస్తూ.. ‘‘శాంతి, సామరస్యం.. ద్వేషం, తీవ్రవాద శక్తులను ఓడించాలి’’ అంటూ ఫవాద్ పోస్ట్ పెట్టారు. ఆయన పోస్ట్ పెట్టిన నిమిషాల వ్యవధిలోనే కేజ్రీవాల్ దానిపై స్పందించారు.

‘‘చౌదరీ సాబ్.. నా దేశ ప్రజలు, నానే.. మా దేశ సమ్యలను పరిష్కరించే పూర్తి సామర్థ్యం కలిగిన వాళ్లమే. మీ అభిప్రాయం అనవసరం. ప్రస్తుతం పాకిస్థాన్‌లో పరిస్థితి అత్యంత దారుణంగా, దయణీయంగా ఉంది. ముందు మీ దేశాన్ని మీరు చక్కబెట్టుకోండి. పక్కనోళ్ల గురించి తర్వాత నుంచి ఆలోచించొచ్చు’’ కేజ్రీవాల్ రిప్లై ఇచ్చారు.

మళ్లీ స్పందించిన ఫవద్

కేజ్రీవాల్ ట్వీట్‌కు ఫవర్ కూడా స్పందించారు. ‘‘సీఎం సాబ్.. ఎన్నికలు అనేవీ మీ అంతర్గత అంశం అందులో సందేహం లేదు. కానీ తీవ్రవాదం అనేది పాకిస్తాన్ లేదా ఇండియాలో ఉన్నా అది హద్దులు లేనిది, ప్రతిఒక్కరికి ప్రమాదకరమైనది కూడా. తీవ్రవాదం విషయంలో బంగ్లాదేశీయులైనా, భారతీయులైనా, పాకిస్థానీలయినా ఎప్పుడో ఒకసారి ఆందోళన చెందాల్సిందే. పాకిస్థాన్‌లో పరిస్థితి అద్భుతంగా లేదు. కానీ ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి సమాజాన్ని కోరుకోవాలి’’ అంటూ హితవు పలికారు.

ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్‌కి సపోర్ట్‌గా ఫవాద్.. ట్వీట్‌లు చేయడంపై బీజేపీ తీవ్ర అనుమానాలు వ్యక్తం చేసింది. ఆప్ నేతల అవినీతి రాజకీయాలకు మద్దతుగా పాకిస్థాన్ కూడా రంగంలోకి దిగిందంటూ బీజేపీ వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్బంగానే ‘‘కేజ్రీవాల్.. భారతదేశ శత్రువులతో గ్లవ్‌లోని చేతిలా ఉన్నారు’’ అని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్ విమర్శించారు.

బీజేపీ ఆరోపణలివి

‘‘ఫవాద్ హుస్సేన్ చౌదరి ఇప్పుడు మాట్లాడుతున్నారు. కేజ్రీవాల్ విడుదలైన రోజున కూడా ఫవాద్.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఐదు దఫాల ఎన్నికల పోలింగ్ పూర్తయింది. ఇప్పటివరకు ఎటువంటి రిమార్క్ లేదు. ఎప్పుడైతే పోలింగ్.. ఢిల్లీలో జరగడం మొదలైందో పాకిస్థాన్ నుంచి స్టేట్‌మెంట్ విడుదలైంది. కేజ్రీవాల్‌కు పాకిస్థాన్ మద్దతు ఉందనడానికి ఈ పరిణామాలే నిదర్శనం’’ అని సచ్‌దేవ్ వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News