ఈడీ కస్టడీ నుంచి కేజ్రీవాల్ ఆదేశాలపై ఈడీ ఆరా?

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నుంచే తన మంత్రులకు ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశమైంది.

Update: 2024-03-26 12:19 GMT

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నుంచే తన మంత్రులకు ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశమైంది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, మొహల్లా క్లినిక్‌లలో ప్రజలకు మందులు, పరీక్షలు అందుబాటులో ఉండేలా చూడాలన్న కేజ్రీవాల్ ఆదేశాలపై తక్షణమే చర్యలు తీసుకుంటామని ఆరోగ్యశాఖ మంత్రి సౌరబ్ భరద్వాజ్ తెలిపారు. కస్టడీలో ఉన్నా ఢిల్లీ ప్రజల శ్రేయస్సు గురించే కేజ్రీవాల్ ఎప్పుడూ ఆలోచిస్తారని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

గత వారంలో కూడా..

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మార్చి 28 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్.. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నీరు, మురుగునీటి సమస్యలను పరిష్కరించాలని మంత్రి అతిషికి ఆదేశాలు జారీ చేశారు. కస్టడీలో ఉన్నప్పుడు ఆదేశాలు బయటకు ఎలా వెళ్లాయన్న దానిపై ఈడీ దృష్టి సారించింది. ఈ విషయంలో మంత్రి సౌరబ్ భరద్వాజ్‌ను ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది.

Tags:    

Similar News