చెన్నైలో ఆరు మిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించిన ‘లెన్నాక్స్’

ఉద్యోగుల సంఖ్యను సైతం భారీగా పెంచుతున్నట్లు వెల్లడి;

Update: 2025-02-12 06:58 GMT

వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్, శీతలీకరణ (హెచ్వీఏసీఆర్) వ్యాపారం చేసే ప్రపంచ అగ్రగామి సంస్థ లెన్నాక్స్ .. చెన్నైలోని తన గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ విస్తరించాలని ప్రణాళికలు రచిస్తోంది.

తన సెంటర్ ను విస్తరించడానికి 6 ఆరు మిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించింది. తన కంపెనీ సామర్థ్యాన్ని లక్షా యాభైవేల చదరపు అడుగులకు విస్తరించబోతున్నట్లు వెల్లడించింది.

అలాగే ఉద్యోగుల సంఖ్య 900 నుంచి 1500 పెరుగుతున్నట్లు పేర్కొంది. కొత్తగా అప్ గ్రేడ్ చేసిన ఈ ఆఫీస్ నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి ఉపయోగించుకోబోతోంది.

ఈ ఆఫీస్ లో ఆధునిక సహకార వర్క్ స్టేషన్ లు, నియంత్రణలు, ఐటీ ల్యాబ్ లు, జిమ్, ప్లే జోన్ లు, వెల్ నెస్ కేంద్రాలు, వ్యక్తిగత గోపత్యకు సంబంధించిన అన్నిఉన్నాయి. అలాగే రీచార్జ్ రూమ్ లు, మదర్ కేర్ రూమ్ లు కూడా ఉన్నాయి.

క్లిష్టమైన సెంటర్..
లెన్సాక్స్ ఈ సెంటర్ ను 2010 లో ప్రారంభించింది. తరువాత కాలంలో ఇది దాని అన్ని సంస్థలకు కీలకమైన కేంద్రంగా అభివృద్ది చెందింది. ప్రారంభంలో ఈ కంపెనీ కేవలం ఐటీ, ఇంజనీరింగ్ పై దృష్టిసారించిన తరువాత కాలంలో ఇప్పుడు ఫైనాన్స్, మార్కెటింగ్, కమ్యూనికేషన్స్, హెచ్ ఆర్, లీగల్, కస్టమర్ ఎక్స్ పీరియన్స్, సోర్సింగ్ వంటి విభిన్న రంగాలకు విస్తరించింది.
ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ప్రకాశ్ బెండపూడి ప్రస్తుతం విస్తరణ ప్రాధాన్యతను వివరించారు. చెన్నై కంపెనీ ప్రపంచ కార్యకలాపాలకు కీలకమైన ప్రదేశంగా మారింది.
‘‘ గత 15 సంవత్సరాలుగా లెన్నాక్స్ దేశంలో 14 మిలియన్ డాలర్ల పెట్టుబడిగా పెట్టింది. ఆవిష్కరణ, ఉద్యోగ సృష్టి, స్థిరమైన అభివృద్ది మా కంపెనినీ బలోపేతం చేసింది. చెన్నైలో నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, మంచి వ్యాపార వ్యవస్థ మా లక్ష్యానికి ఆదర్శవంతమైన ప్రదేశంగా మారింది’’ అన్నారు.
నిబద్దత..
మేము భవిష్యత్ కోసం పెట్టుబడి పెడుతున్నామని, సరైన ప్రదేశంలో, మంచి ప్రతిభను కనపరచడం అనేది పోటీతత్వం ప్రయోజనం, ఇది భవిష్యత్ ఆవిష్కరణకు ఇంధనాన్ని అందిస్తుందని ఆయన అన్నారు.
మా కంపెనీ తాజా నిర్ణయం కొత్త ప్రతిభను వెలికి తీయడంలో ఐఐటీ మద్రాస్, ఎస్ఆర్ఎం యూనివర్శిటీలతో సమానంగా ఉంటుందన్నారు.
ఏఐ.. ఎంఎల్..
లెనాక్స్ తన హెచ్వీఏసీఆర్ ఉత్పత్తుల కోసం కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ ద్వారా మరింత ముందుకు తీసుకెళ్తుంది. ‘‘ లెన్నాక్స్ లో ఏఐ అప్లికేషన్స్ పై దృష్టి పెట్టబోతున్నాం. మా ఏఐ ఆధారిత విశ్లేషణలు శక్తి వినియోగం, అంచనా నిర్వహణ, కస్టమర్ అనుభవాన్ని ఆప్టిమైజ్ చేస్తాయి’’ అని బెండపూడి వివరించారు.
విద్యుద్దీకరణ, డీ కార్బనైజేషన్..
ఈ ఆవిష్కరణలలో చెన్నై జీసీసీ కీలకపాత్ర పోషించబోతోంది. లెన్నాక్స్ లో 60 మంది నిపుణులతో కూడిన ప్రత్యేక ఏఐ, ఎంఎల్ బృందాన్ని నియమించింది. వీరిలో చాలా మంది చెన్నైలోనే ఉన్నారు.
ఈ బృందం వినియోగదారుల ప్రవర్తన ఆధారంగా హెచ్వీఏసీ సెట్టింగ్ లను ఆప్టిమైజ్ చేసే ఏఐ ఆధారిత స్మార్ట్ థర్మోస్టాట్ లు, వేగవంతమైన మరింత ప్రభావవంతమైన సిస్టమ్ మరమ్మతుల కోసం ఏఐ ఆధారిత సాధనాల వంటి ప్రాజెక్ట్ ల కోసం పనిచేస్తోంది. నాణ్యత నియంత్రణను కోసం కంప్యూటర్ విజన్ టెక్నాలజీని వాడుతున్నారు.
అలాగే విద్యుద్దీకరణ, డీకార్భజైనేషన్ ధోరణులపై దృష్టి సారిస్తోంది. ‘‘ శిలాజ ఇంధన ఆధారిత తాపన నుంచి విద్యుత్ హీట్ పంపులకు మారడం మా పరిశ్రమలో వచ్చిన అతిపెద్ద మార్పులలో ఒకటి. ఈ అప్లికేషన్ ల ద్వారా దానిని నడిపించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని బెండపూడి అన్నారు.
Tags:    

Similar News