ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్నికల కమిషనర్.. ఎందుకంటే..

కౌంటింగ్ జరగబోయే ముందు విపక్షాలు తప్పుడు కథనాలు వ్యాప్తి చేస్తున్నారని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2024-06-03 09:57 GMT

ఎన్నికల కౌంటింగ్ కు ముందు సీఈసీ రాజీవ్ కుమార్ ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో విపక్ష కూటమి కావాలనే తప్పుడు కథనాలు వ్యాప్తి చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

సోమవారం (జూన్ 3) విలేకరుల సమావేశంలో రాజీవ్ కుమార్ మాట్లాడుతూ, “ఎలాంటి ఆధారాలు లేకుండా నకిలీ కథనాలు” వ్యాప్తి చేయడానికి ప్రణాళిక బద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. ముందుగా ఓటర్ల జాబితాపై ఆరోపణలు గుప్పించారని, తరువాత ఈవీఎంలపై ఆ తరువాత వీవీప్యాట్ పై రాద్ధాంతం చేశారని, ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియపై మరోసారి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు. దేశం వెలుపల నుంచి జరిగే దాడులను ఎదుర్కొనేందుకు ఈసీ సిద్ధంగా ఉందని, అయితే లోపల నుంచి దాడులు జరుగుతున్నాయని అన్నారు.
ప్రతిపక్షాల డిమాండ్‌పై ..
కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ప్రతిపక్షాలు దాదాపు అన్ని డిమాండ్లను ఆమోదించాయని అన్నారు. అయితే ప్రతిపక్షాలు కోరినట్లుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయి, ఈవీఎంల ఓట్ల లెక్కింపుకు ముందే ఫలితాలు ప్రకటిస్తారా అనే దానిపై నేరుగా సమాధానం ఇవ్వడానికి కుమార్ నిరాకరించారు.
ఓటరు జాబితాల నుంచి చాలామంది పేర్లు గల్లంతు అవడం, ఏడు దశల ఓటింగ్ తరువాత తుది ఓటింగ్ జాబితాను ప్రచురించడంలో ఈసీ ఆలస్యం చేస్తుందని, ఓటింగ్ శాతాన్ని పెంచి చూపుతోందని ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను సీఈసీ తోసిపుచ్చింది. ఇవన్నీ నిరాధార, నకిలీ కథనాలని పేర్కొంది.
కేంద్ర హోంమంత్రి 150 మంది డీఎంలు, ఆర్‌ఓలను (రిటర్నింగ్ అధికారులు) పిలిచారని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ చేసిన ఆరోపణలపై కుమార్ స్పందించారు. “...వారందరినీ (డీఎంలు/ఆర్‌ఓలు) ఎవరైనా ప్రభావితం చేయగలరా? ఇప్పటి వరకూ ఎవరైనా ప్రభావితం అయినట్లు ఆధారాలు ఉన్నాయా? అలా చేసిన వారి వివరాలు ఇవ్వండి. మేము తగిన శిక్ష విధిస్తాం, మీరు పుకార్లు పుట్టించి అందరిని అనుమానించొద్దు ” అని అన్నారు.
"మేము లాపాటా జెంటిల్మెన్' కాదు"
సీఈసీ మాట్లాడుతూ, ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో 31.2 కోట్ల మంది మహిళలతో సహా 64.2 కోట్ల మంది ఓటర్లు ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొని రికార్డు సృష్టించారని, ఇది భారత్ సృష్టించిన ప్రపంచ రికార్డు అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల కసరత్తులో 68,000 పర్యవేక్షణ బృందాలు.. 1.5 కోట్ల మంది పోలింగ్, భద్రతా సిబ్బంది పాల్గొన్నారని ఆయన చెప్పారు.
ఎన్నికల కమిషనర్‌లను "లాపటా జెంటిల్‌మెన్" అని పిలుస్తున్న సోషల్ మీడియా మీమ్‌లలో కుమార్, "మేము ఎప్పుడూ ఇక్కడే ఉంటాము, ఎప్పుడూ కనిపించకుండా పోయాము. ఇప్పుడు మీమ్స్ 'లాపటా జెంటిల్‌మెన్' తిరిగి వచ్చినట్లు చెబుతారా? అన్నారు.
నాలుగు దశాబ్దాలలో అత్యధిక పోలింగ్..
2024 లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు దాదాపు నాలుగు లక్షల వాహనాలు, 135 ప్రత్యేక రైళ్లు, 1,692 ఎయిర్‌సార్టీలు ఉపయోగించామని కుమార్ చెప్పారు. 2019లో 540 రీపోల్స్ జరగ్గా, 2024 సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 39 రీపోల్స్ జరిగాయి.
జమ్మూ కాశ్మీర్‌లో నాలుగు దశాబ్దాల్లో అత్యధికంగా 58.58 శాతం నమోదైందని, లోయలో 51.05 శాతం పోలింగ్‌ నమోదైందని సీఈసీ పేర్కొంది. 2019 లో 3500 కోట్ల నగదు, మద్యం సీజ్ చేశామని, ప్రస్తుత ఎన్నికల్లో రూ. 10 వేల కోట్లు నగదు,మద్య, డ్రగ్స్ సీజ్ చేసినట్లు వివరించారు.


Tags:    

Similar News